అయోధ్య వివాదం ముగిసి రెండు రోజులైంది.  అయోధ్య వివాదంలో ఎవరూ కూడా జోక్యం చేసుకోవద్దని, ప్రజలు ఎవరూ కూడా అయోధ్యపై తప్పుడుగా ప్రచారం చేసినా, రెచ్చగొట్టే విధంగా పోస్టింగులు పెట్టినా దానివలన జరిగే పరిణామాలు దారుణంగా ఉంటాయని స్పష్టం చేసింది.  ఎవరూ కూడా ఈ విషయంపై తప్పుగా మాట్లాడొద్దని పలుమార్లు యూపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసింది.  అయినప్పటికీ కొంతమంది అత్యుత్సాహం ప్రకటించారు. 


తమను తాము పెంచుకోవడానికో లేదంటే యూట్యూబ్ లో వ్యూస్ పెంచుకోవడానికో ఇలాంటి విషయాలకు మరింత వివాదాన్ని జోడించి వీడియోలు చేసారు. ఇంకేముంది... ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.  సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది.  ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. అయోధ్య విషయంలో నిబంధనలకు మించి పోస్టింగులు చేసిన, యూట్యూబ్ లో వీడియోలు చేసిన 77 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.  సోషల్ మీడియాలో వీడియోపై వచ్చిన వాటిని తొలగించారు.  


వారి ప్రొఫైల్స్ ను సైతం తొలగించింది. ప్రొఫైల్స్ ను తొలగించడంతో ఆగిపోకుండా, అసలు ఎవరు ఇలా చేస్తున్నారు అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఇదిలా ఉంటె, అయోధ్యలో మాత్రం దీనిపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు.  అయోధ్యలో అసలు ఏం జరగనట్టుగా చాలా కామ్ గా ఉన్నది.  పోలీస్ ల సంరక్షణలో అయోధ్య ప్రశాంతంగా ఉండటం విశేషం.  మూడు నెలల్లోగా అయోధ్య ట్రస్ట్ కు భూమిని అప్పగించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.  


మూడు నెలలు అని గడువు ఇచ్చినా.. ప్రభుత్వం ఈనెలలోనే ట్రస్ట్ కు అప్పగించాలని చూస్తోంది.  ట్రస్ట్ కు అప్పగించిన తరువాత అక్కడ రామాలయ నిర్మాణం ప్రారంభం అవుతుంది.  వచ్చే ఏడాది శ్రీరామా నవమి వరకు కొంత వరకు నిర్మాణం పూర్తి కావొచ్చు.  అక్కడే వచ్చే ఏడాది నవమి వేడుకలు జరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఏది ఏదేమైనా 134 సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్య ఎట్టకేలకు పరిష్కారం జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: