అయోధ్య వివాదం గురించి ఈ జనరేషన్ కు ఖచ్చితంగా పూర్తిగా ఏమి తెలియదు. మొన్న శనివారం సుప్రీం కోర్ట్ అయోధ్య తీర్పును ఇవ్వటంతో అందరూ గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అయోధ్యలోని వివాదాస్పద భూమిపై 134 ఏళ్లుగా సాగుతున్న భూయాజమాన్య హక్కుపై సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇన్నేళ్లుగా తేలని ఈ చిక్కుముడిని ఈ రోజు సుప్రీంకోర్టు తేల్చేసిన నేపథ్యంలో.. గూగుల్ జనరేషన్ కు చాలానే డౌట్లు వచ్చాయి.అయోధ్యపై సుప్రీంతీర్పు నేపథ్యంలో హాట్ టాపిక్ గా మారిన అయోధ్య అంశం నెంబరు వన్ స్థానంలో నిలిచింది. అంతేకాదు.. లేటెస్ట్ పరిణామాల వేళ.. గూగుల్ తరానికి మస్తు సందేహాలు వచ్చాయి. మరింకేమీ ఆలోచించకుండా గూగుల్ ను తమకున్న సందేహాల్ని అడిగి తెలుసుకుంటున్నారు.


ఈ తరం వారు గూగుల్ అడిగిన ప్రశ్నలను ఒక సారి పరిశీలిస్తే .. ఇంతకీ గూగుల్ ను వారు సంధిస్తున్న ప్రశ్నల పరంపర చూస్తే.. అయోధ్య తీర్పు నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో.. ఐపీసీ సెక్షన్ 144 అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. అంతేకాదు.. అయోధ్యపై సుప్రీంతీర్పు నేపథ్యంలో రేపు (శనివారం) సెలవు ఉందా? అన్న ప్రశ్నను సంధించారు.  సుప్రీం తీర్పు నేపథ్యంలో పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ నెల 11 వరకూ సెలవులు ఇచ్చేశారు. దీంతో.. సెలవులపై క్లారిటీ కోసం గూగుల్ ను తెగ అడిగేశారు.


అక్కడితో ఆగకుండా సుప్రీం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ ఎవరు ?  అన్న ప్రశ్నతో పాటు.. ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వారు? ఆయన కులం ఏమిటి? మతం ఏమిటి? లాంటి ప్రశ్నల్ని సంధించారు నెటిజటన్లు. అంతేకాదు.. అసలు అయోధ్య కేసు ఏమిటి? తాజాగా ఇచ్చిన తీర్పు ఏమిటి? లాంటి ప్రశ్నల్ని కూడా గూగుల్ లో సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రెండ్ గా ఉన్న అంశాల్ని ఎక్కువగా వెతికే ఈ తరానికి తగ్గట్లే అయోధ్యపై సుప్రీం తీర్పు వేళ.. అలాంటి సీనే మరోసారి రిపీట్ అవుతుందని చెప్పక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: