చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓడిపోయినా ..  నా పాలన బ్రహ్మాండంగా ఉంది కానీ ఎందుకు ఓడిపోయానో తెలియడం లేదని ఆమధ్య డప్పు కొట్టిన సంగతీ తెలిసిందే. అయితే తాజాగా ఒక రిపోర్ట్ చంద్రబాబు పాలనా ఎంత ఘోరంగా సాగిందో గణాంకాలు చెబుతున్నాయి. 2016లో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న మరణాలు - ఆత్మహత్యలకు సంబంధించిన అధ్యయనాన్ని నిర్వహించింది ఎన్సీఆర్బీ (జాతీయ నేర గణాంక సంస్థ)ఈ సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంటే.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్.. ఆరో స్థానంలో తెలంగాణ ఉన్నట్లు తేలింది. వ్యవసాయ రంగంపై అత్యధికంగా ఆధారపడి ఆత్మహత్య చేసుకున్న వారు వందల్లో ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొంది.


 మొత్తం మన దేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతన్నలు సుమారు 11,700 మంది ఉంటే  .. వారిలో ఏపీకి చెందిన వారు 7.06 శాతం మంది కాగా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు 5.66 శాతం. ఏపీతో పోలిస్తే తెలంగాణలో సొంతభూమి ఉన్న రైతులు.. రైతుకూలీలు ఎక్కువమంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు వెల్లడించారు. ఏపీలో ఆత్మహత్య చేసుకున్న వారిలో 730 మంది పురుషులు ఉంటే.. 74 మంది మహిళలు ఉన్నారు. అదే సమయంలో తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల్లో పురుషులు 572 మంది ఉండగా.. మహిళలు 73 మంది ఉన్నారు.


దీనితో బాబు గారి పాలనలో రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తాజా రిపోర్ట్ చూస్తుంటే తెలుస్తుంది. అందుకే కసితో రైతులందరు కలిసి చంద్రబాబును చిత్తుగా ఓడించి జగన్ ను ఎన్నుకున్నారు.   తన పాలన గురించి గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. తాజాగా విడుదలైన ఈ నివేదిక మీద ఏమని బదులిస్తారు? అన్నదాతలకు తాను చేసినంత మంచి మరెవరూ చేయలేరని తరచూ గొప్పలు చెప్పుకునే బాబు మాటల్లో నిజం ఎంత డొల్ల అన్నది తాజాగా విడుదలైన నివేదికను చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: