కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీ తహశీల్దార్ హసీనా బీ ప్రస్తుతం పరారీలో ఉన్న విషయం తెలిసిందే. అడంగల్ లోని రెడ్ మార్క్ తొలగించేందుకు హసీనా బీ రైతును 8 లక్షల రూపాయలు డిమాండ్ చేసి చివరకు 4 లక్షల రూపాయలకు ఒప్పుకుంది. అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ 6 నెలలు తిప్పించుకోవటంతో పాటు 4 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరడంతో రైతు సురేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 
 
హసీనా బీ తన బినామీని డబ్బు తీసుకోమని పంపించగా ఏసీబీ అధికారులు చాకచక్యంగా హసీనా బీ బినామీ మహబూబ్ భాషా ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మహబూబ్ భాషా రిమాండ్ లో ఉన్నాడు. తహశీల్దార్ హసీనా బీని పట్టుకోవటం కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు తహశీల్దార్ హసీనా బీ కోసం జరిపిన విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హసీనా బీ కర్నూలు జిల్లాలోని బీ క్యాంప్, సీ క్యాంప్ ఏరియాలలో 7 హాస్టళ్లలో రూములు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. 
 
7 హాస్టళ్లలో హసీనా బీ ఎందుకు రూములు తీసుకున్నారనే విషయం పోలీసులకు కూడా తెలియటం లేదు. ఏసీబీ అధికారులు హసీనా బీ బంధువుల ఇళ్లలో తనిఖీలు చేశారు. అధికారులు హసీనా బీ బంధువులు హసీనా ఇంటికి వస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. పలు బృందాలు హసీనా బీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఏసీబీ అధికారులు హసీనా బీ ముద్దాయిగా ఉన్నారని ఆమెకు ఎవరైనా ఆశ్రయం ఇస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. 
 
ఆశ్రయం ఇచ్చిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయటంతో పాటు చర్యలు తీసుకుంటామని తెలిపారు. తహశీల్దార్ హసీనా బీ దొరికితే హసీనా బీ ఇప్పటివరకు చేసిన అక్రమాలు అన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తహశీల్దార్ హసీనా బీ ఒక పెట్రోల్ బంక్ అనుమతి కొరకు 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసిందని గూడూరు మున్సిపాలిటీలో కొంతమంది ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: