చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. తాను నిప్పు అంటారు, తన పాలాన్ని స్వర్ణయుగం అంటారు. తన పాలనలో ప్రపంచంలో ఎవరూ చేయని ఎన్నో గొప్ప‌ పనులు చేశారని పదే పదే చెప్పుకుంటారు. మహా నగరాలను కట్టానని, కంప్యూటర్లను కనిపెట్టాలని కూడా బాబు అనేస్తూంటారు. ఇక తన కంటే మించిన ఉత్తమ పరిపాలకుడు లేడని కూడా బాబు గొప్పలు పోతారు. మరి బాబు పాలన అయినా ఆయన చెప్పే అ నిప్పూ నిజాయ‌తీ కధలైనా ఎంత నిజం ఉంది. బాబును ఆ తాజా నివేదిక ఎందుకు భయపెడుతోంది...?


చంద్రబాబు పాలనలోనే దేశంలో ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు జరిగాయని తాజాగా  ఓ నివేదిక ఇపుడు బయటపెట్టింది. ఆ నివేదికలో  రైతుల ఆత్మహత్యల్లో దేశంలో నవ్వాంధ్రకు నాలుగవ స్థానం ఇచ్చింది. అలాగే   గ్రేడింగుల్లో, శాతాల్లో కూడ ఏపీ అన్న దాతల ఆత్మహత్యల్లో ఎక్కువగానే ఉంది.  దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న మరణాలు - ఆత్మహత్యలకు సంబంధించిన అధ్యయనాన్ని 2016లో  జాతీయ నేర గణాంక సంస్థ నిర్వహించింది. ఈ సంస్థ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే గుండెలు చెదిరే వాస్తవాలు  బయటపడుతున్నాయి.  అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంటే.. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్.. ఆరో స్థానంలో తెలంగాణ ఉన్నట్లు తేలింది


మరి ఈ నివేదిక మీద చంద్రబాబు ఏమంటారని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. తన పాలనలో రైతులకు అన్నీ చేశానని చెబుతున్న బాబు ఈ నివేదిక మీద మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు.  అన్నదాతలు వ్యవసాయ కూలీలు 11379 మంది ఉంటే.. వారిలో ఏపీకి చెందిన వారు 7.06 శాతం మంది  ఉన్నారని ఆ నివేదిక బయటపెట్టింది. ఇక ఏపీలో ఆత్మహత్యల్లో  730 మంది పురుషులు ఉంటే.. 74 మంది మహిళలు ఉన్నారని కూడా పేర్కొంది. ఇపుడు ఈ నివేదిక బయటపడడంతో తమ్ముళ్ళు సైతం సైలెంట్ అవుతున్నారు. దీని మీద వైసీపీ నేతలు మరింతగా రెచ్చిపోవడానికి అవకాశం ఉంది. రైతు జన బాంధవుడు వైఎస్సార్, ఆ తరువాత జగనేనని కూడా వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఆరు నెలల జగన్ పాలన కాకుండానే  విమర్శలు చేస్తున్న బాబు ఈ నివేదిక మీద కూడా మాట్లాడితే బాగుంటుందని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: