మహారాష్ట్రలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి.  ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అర్ధం కావడం లేదు.  మహారాష్ట్రలో ఎన్నికల హడావుడి ముగిసి చాలా రోజులైంది.  అంతా సజావుగానే సాగుతుంది అనుకున్న సమయంలో లిటిగేషన్లు పెట్టుకోవడం.. కోపాలకు పోవడంతో.. మహారాజకీయం వేడెక్కింది.  ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ ఇవ్వలేదు ఓటర్లు.  దీంతో రాజకీయ పార్టీలు ఒకరినొకరు తన్నుకుంటున్నాయి.  ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మల్లగులాలు పడుతున్నాయి.  


నిన్నటి వరకు మహారాష్ట్రలో బీజేపీ అధికారం ఏర్పాటు చేస్తుందని ధీమాతో ఉన్నా, సంఖ్యాబలం లేకపోవడంతో రెండుసార్లు కొర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని... అధికారం ఏర్పాటు చేసే అంశంపై అనేక విషయాలు చర్చించి చివరకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగిన బలం లేదని తెలుసుకొని గవర్నర్ ఆహ్వానాన్ని తిరస్కరించారు.  దీంతో గవర్నర్ శివసేన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించాడు.  ఇదే శివసేనకు కావాల్సింది.  


అయితే, శివసేనకు కేవలం 53 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నది.  తమకు 170 మంది సపోర్ట్ ఉందని చెప్తోంది.  కాంగ్రెస్, ఎన్సీపీలు తమకే సపోర్ట్ చేస్తాయని అంటోంది.  ఎప్పుడైతే శివసేనను గవర్నర్ ఆహ్వానించారో.. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి కోపం వచ్చింది.  శివసేనను ఆహ్వానించడంపై విరుచుకుపడటం మొదలుపెట్టారు.  ఇప్పుడు శివసేనను ఆహ్వానించారు కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు అని కాంగ్రెస్ అనుకుంటోంది.  


ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి వారిని జైపూర్ లోని రిసార్ట్ లో ఉంచిన సంగతి తెలిసిందే.  కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా శివసేనకు మద్దతు ఇచ్చేందుకు సుముఖంగా లేనట్టుగా తెలుస్తోంది.  శివసేనతో కలిస్తే.. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో దెబ్బతింటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.  శివసేనకు హిందుత్వ పార్టీ అనే పేరు ఉన్నది.  బాల్ థాకరే ఈ విధంగానే పార్టీని స్థాపించారు.  ప్రజల్లో ఇదే నమ్మకం ఉన్నది.  ఆ పార్టీ సిద్దాంతాలు కూడా అలానే ఉంటాయి. అధికారం కోసం ఇప్పుడు ఆ పార్టీ తన స్టాండ్ ను మార్చుకోవాలని చూసి, కాంగ్రెస్ తో కలిస్తే.. అది కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అవుతుంది.  అందుకే ఆ పార్టీతో కలవకూడదని అనుకుంటున్నారు.  మరి ఈ మహా పోరులో విజేత ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: