మహారాష్ట్ర  ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి రాజకీయాలు రోజుకో  మలుపు తిరుగుతున్నాయి. మహారాష్ట్రలో  288 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ శివసేన కూటమికి  మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయి. దీంతో మరోమారు ఎన్డీయే  ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని   అందరూ భావించారు. అయితే శివ సేన పార్టీకి సంబంధించిన నాయకుడిని రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిని చేయాలని శివసేన బీజేపీని  డిమాండ్ చేయడంతో ఆ డిమాండ్ కి  బిజెపి అంగీకరించలేదు. ఈ క్రమంలో రోజురోజుకు మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మహారాష్ట్రలో  ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.



 శివసేన పార్టీ మాత్రం తమ పార్టీ నాయకుడిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారని దృఢ నిశ్చయంతో ఉందీ . అటు  ప్రజలు కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ కట్ట పెట్టకపోవడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో ట్విస్ట్  తెర మీదకు వస్తుంది. అయితే రెండున్నర సంవత్సరాలు పాటు  తమ పార్టీ నాయకుడికి ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాలని  డిమాండ్ చేయడంతో బిజెపికి శివసేనకు విభేదించింది.  దీంతో శివసేన ఎట్టిపరిస్థితిలో సీఎం పీఠాన్ని అదిష్టించాలని భావిస్తుండగా... ఎన్సీపీ తో  పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది.మరో వైపు   కాంగ్రెస్ కూడా శివసేనకు  బయటి నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా బీజేపీ ని  అధికార పీఠం దక్కకుండా దూరం చేయవచ్చని భావిస్తోందట. 



 ఈ క్రమంలో రోజురోజుకీ మహారాష్ట్ర రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఎన్సీపీ అధినేత శరత్  పవార్ శివసేన  పార్టీతో పొత్తు కి ఒక మెలిక పెట్టారు . బిజెపితో పూర్తిగా తెగతెంపులు చేసుకున్న తర్వాతే  శివసేనతో జట్టు కడతామని శరత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ స్పష్టం చేసింది. ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగాలని   సూచించింది. అయితే ఎట్టి పరిస్థితిలో సీఎం పీఠాన్ని శివసేన నాయకుడే అధిష్టించాలనుకుంటున్న  శివసేన అధినేత... ఎన్సీపీ కోరికను నెరవేర్చే ఆలోచనలోనే ఉన్నట్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఉద్ధవ్ థాక్రే ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం అని కేంద్రమంత్రి అరవింద్ సావంత్  కూడా ప్రకటించారు. మరి రాబోయే రోజుల్లో మహా  రాజకీయాల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో  చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: