ఎలుకలు ఇళ్లల్లో ఎంత రచ్చ చేస్తాయో  అందరికీ తెలిసిందే. చిన్న చిన్న సందు ల్లో  దూరి అడ్డు వచ్చిందల్లా  కొరికేస్తూ వెళ్తూ ఉంటాయి. ఇంకా ఎలుకలను పట్టేందుకు  యజమానులు సర్వ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కానీ  ఎరుకలు  మాత్రం  తో ఇంట్లో అందరిని చాలా  ఇబ్బందిని పెడ్తు ఉంటాయి. తాజాగా ఒక చిట్టి ఎలుక పెద్ద  విమానాన్నే  ఆపేసింది. ఇక విమానం ఆగిపోవడంతో ప్రయాణికులందరూ ఆందోళనకు దిగారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు ప్రయాణికులు.దీంతో ఎయిర్ పోర్టులో  అంతా గందరగోళం నెలకొంది. ఇంతకీ ఆ చిట్టి ఎలుక విమానాన్ని ఎలా ఆపింది అనుకుంటున్నారా... అయితే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. 



 శంషాబాద్ విమానాశ్రయంలో నిన్న శంషాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఏకంగా 11 గంటల 30 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. దీంతో సగటు విమానంలో ప్రయాణించే ప్రయాణికులు ఆందోళనకు దిగారు. అక్కడి విమానాశ్రయ అధికారులతో ప్రయాణికులందరూ వాగ్వాదానికి దిగడంతో  శంషాబాద్ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. విమానం ఆలస్యంగా బయలుదేరడం కి కారణం ఏమిటన్నది తాజాగా వెల్లడైంది. విమానం ఆలస్యంగా బయలుదేరడానికి కారణం ఏ  సాంకేతిక సమస్యో  లేక వాతావరణ సమస్యో  కాదు... ఇందుకు కారణం ఏంటో తెలుసా ఒక చిట్టి ఎలుక. చిట్టి ఎలుక కారణంగా విమానం అన్ని  గంటలు ఆలస్యం అయినట్లు తేలింది. 



 ఓ ఎలుక విమానంలో దూరినట్లు సిబ్బంది గమనించారు. అయితే ఈ విషయాన్ని ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు సిబ్బంది. దీంతో దాన్ని పట్టుకునే ఇంతవరకు విమానాన్ని నిలిపివేశారు అధికారులు. ముందే  చిట్టి ఎలుక అంత పెద్ద విమానంలో సిబ్బందిని బాగా ఇబ్బంది పెట్టింది. దీంతో ఆ చిట్టి ఎలుకను పట్టుకునేందుకు 10 గంటలకు పైగానే శ్రమించారు సిబ్బంది. ఇక ఎట్టకేలకు తీవ్రంగా శ్రమించి ఆ ఎలుకను  పట్టుకున్నాడు. దీంతో ఉదయం 6.10 గంటలకు  బయలుదేరాల్సిన విమానం...  సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు బయలుదేరింది. ఈ విషయంలో విమానాశ్రయ సిబ్బంది కి కొంత నష్టం కలిగిందనే  చెప్పాలి ఎందుకంటే విమానంలో మొత్తం 250 మంది ప్రయాణించాల్సి ఉండగా వారిలో 50 మంది టిక్కెట్లు రద్దు చేసుకొని వెనక్కి వెళ్లిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: