పాత యుగాల సంగతేమీ కానీ.. ఆధునిక కాలంలో భార్యభర్త బంధానికి ప్రాధాన్యత ఉంది. భర్త లేదా భార్య చట్టప్రకారం ఒక్కరికే పరిమితం. కొన్ని మతాలు ఈ విషయంలో భర్తలకు కాస్త వెసులుబాటు ఇచ్చాయి. కానీ.. ఓ ప్రాంతంలో మాత్రం మహిళ ఎంతమందితో నైనా సెక్స్ చేయవచ్చట. అందుకు అడ్డు అదుపూ ఏమీ ఉండవట.


ఇంతకీ ఈ ప్రాంతం ఎక్కడ అంటారా.. ఇది చైనాలోని సిజువాన్ ప్రాంతం. ఇది టిబెట్ సరిహద్దుల్లో ఉంది. అక్కడి ప్రజలు ముసోవ్ జాతికి చెందినవారు. వీరి సంఖ్య మొత్తం నలభై వేలమంది. హిమాలయాల పర్వత ప్రాంతంలోని ఈ కొండజాతి సంస్కృతిలో పురుషుడికి పెద్దగా విలువ ఉండదట.


ఇక్కడ అన్నిటా స్త్రీలదే పై చేయి. అసలు వీరి భాషలో తండ్రి, భర్త అనే పదాలే లేవు. స్త్రీలే అన్ని ప్రధాన నిర్ణయాలను తీసుకుంటారు. పదమూడేళ్లు దాటిన ప్రతి మహిళ తనకు ఎంత మంది ఇష్టమైతే అంతమంది పురుషులతో సెక్స్ చేయొచ్చు. ఎవరికి ఎవరు తండ్రో తెలీదు. తండ్రి గురించిన చర్చే రాదు.


ఓ మగవాడికి ఓ స్త్రీ మీద కోరిక కలిగితే, దాన్ని ఆమె స్వాగతిస్తేనే ఆమె ఇంటికి వెళతాడు. ఇంటిపని, వంటపని, పశువులను చూసుకోవడం, కట్టెలను ఏరుకు రావడంలాంటి అన్ని పనులనూ మహిళలే చేస్తారు.ఒకే ఇంట్లో ఆడ, మగ కలిసి జీవించే పద్ధతే అక్కడ లేదు. వ్యక్తిగతపడక గదులు ఉండవు.


ఇలాంటి ఆచారాలు కొండ జాతుల్లో ఉంటుంటాయి. అక్కడి ఇప్పటికీ మహిళ సర్వస్వతంత్రురాలుగా ఉంది. అనాగరికులుగా చెప్పుకుంటున్న కొండ జాతులు మహిళలకు ప్రాధాన్యం, హక్కులు కల్పిస్తుంటే.. ఆధునికులుగా చెప్పుకుంటున్న సమాజాలు మాత్రం అన్ని విషయాల్లోనూ స్త్రీని అణిచివేస్తున్నారు. అమెరికా వంటి దేశంలో ఇంకా ఓ మహిళ దేశాధ్యక్షురాలు కాకపోవడం ఇందుకు ఓ చక్కని ఉదాహరణ.


మరింత సమాచారం తెలుసుకోండి: