నరేంద్రమోడికే శివసేన పెద్ద షాక్  ఇచ్చింది.  ఎన్డీఏలో నుండి శివసేన బయటకు   వచ్చేసింది. ఎన్డీఏలో శివసేన తరపున భారీ పరిశ్రమల మంత్రిగా పనిచేసిన అరవింద్ సామంత్ సోమవారం ఉదయం రాజీనామా చేశారు. దాంతో  ఉన్న ఒకే కేంద్రమంత్రి రాజీనామా చేయటంతో మహారాష్ట్ర రాజకీయాలు మరింత హీటెక్కిపోతోంది.

 

మహారాష్ట్రలో  శివసేన, ఎన్సీపి, కాంగ్రెస్ కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శివసేన అధినేత ఉద్థవ్ ఠాక్రే ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు ఎన్సీపీ నే శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి స్పందించారు. ఎన్డీఏలో నుండి శివసేన బయటకు వచ్చేస్తే మద్దతు ఇవ్వటానికి తమకు అభ్యంతరం లేదని కాంగ్రెస్, ఎన్సీపి చెప్పాయి.

 

దాంతో ఎన్డీఏలో నుండి శివసేన బయటకు వచ్చేసింది. తమతో పొత్తులు వదులుకుని, ఎన్డీఏలో నుండి శివసేన బయటకు వెళ్ళిపోతుందని నరేంద్రమోడి కానీ బిజెపి ఊహించి ఉండదు. కానీ శివసేన ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేయటంతో నరేంద్రమోడి, అమిత్ షా, ఫడ్నవీస్ లాంటి నేతలకు పెద్ద షాక్ తగిలింది.

 

ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న మోడికి తగిలిన మొదటి షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే వివిధ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో సంఖ్యాబలం తక్కువగా ఉన్నా సిక్కిం, గోవా లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగలిగిందంటే అందుకు బిజెపి కేంద్రంలో అధికారంలో ఉండటమే కారణమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

మరి మహారాష్ట్రలో సంఖ్యాబలం రీత్యా అందరికన్నా ఎక్కువున్నా ప్రభుత్వం ఏర్పాటు చేయలేక చతికిలపడిందంటే అది మోడి, అమిత్ ఫెయిల్యూర్ గానే చెప్పుకోవాలి. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బిజెపికి 105 మంది ఎంఎల్ఏలున్నారు. శివసేనకు 56, ఎన్సీపికి 54, కాంగ్రెస్ కు 44 మంది ఎంఎల్ఏలున్నారు. మరికొంతమంది స్వతంత్రులు కూడా గెలిచారు లేండి. ఇపుడు శివసేన, ఎన్సీపి, కాంగ్రెస్ కలయికతో  ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సినంత సంఖ్యాబలం ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుంది ? బిజెపి ఎంతకాలం ఉండనిస్తుంది ? అన్నదే చూడాలి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: