ఈ రోజు 11 గంటలకు అధికార ప్రకటన
ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనను ఆహ్వానించిన గవర్నర్
ఈ నేపథ్యంలోనే కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పదవికి రాజీనామ..! 



ఈ నిర్ణయంతో ఎన్డీఏ కూటమి నుండి శివసేన బయటకు వెళ్లినట్టేనని భావిస్తున్న రాజకీయ విశ్లేషకులు...
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేపు తున్నాయి. కేంద్ర మంత్రి తీసుకున్న నిర్ణయం దానికి బలం చేకూరుస్తోంది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్​సింగ్​ కోషియారీ శివసేనను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరి ణామాలు జరుగు తున్నాయి. శివసేన పార్టీ ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్​ సావంత్​ మారుతున్న పరిణామాలకు అనుకూలంగా  కీలక నిర్ణయం తీసుకున్నారు. తను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు అధికారికంగా తన రాజీనామా ప్రకటన వెల్లడించే అవకాశం ఉంది.



ఇదిలా ఉండగా... శివసేన తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్డీఏ కూటమి నుంచి శివసేన బయట కొచ్చేసినట్టేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
ఎన్​సీపీ ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతు ఇవ్వాలంటే ముందుగా ఎన్డీఏ కూటమి నుంచి శివసేన తప్పుకోవాలని ఎన్​సీపీ మెలిక పెట్టిన సంగతి తెలిసిందే. వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వంలోని అన్ని పదవులకూ సేన నాయకులు రాజీనామా చేయాలని పేర్కొంది.



మరోవైపు అరవింద్​ సావంత్​ రాజీనామాకు సిద్దమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏదేమైనా ఎన్​సీపీ తాజా ప్రతిపాదనకు శివసేన కూడా సుముఖంగా ఉన్నట్లు జరుగుతున్న పరిణామాల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అరవింద్ లాగే మిగతా శివసేన మంత్రులు కూడా రాజీనామా బాట పడతారా..? లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఏమి జరుగుతుందో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: