మహారాష్ట్రలో 53 సంవత్సరాల క్రింత శివసేన పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకూ ఎప్పుడూ అధికార పీఠం ఎక్కింది లేదు. పార్టీ పెట్టినప్పటి నుండి అధికారాన్ని ఇతరులతో పంచుకోవటమే కానీ ముఖ్యమంత్రి కుర్చి మీద మాత్రం ఎప్పుడూ కన్నేయలేదనే చెప్పాలి. కానీ తాజాగా మాత్రం ఎందుకో ముఖ్యమంత్రి కుర్చి తమకే కావాలని పట్టుపట్టింది.

 

ఎన్నికలకు ముందు కూడా సిఎం కుర్చీ కోసం శివసేన ఎక్కడా మాట్లాడలేదు. జర్నలిస్టుగా ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించిన బాల్ ఠాక్రే ఆధ్వర్యంలో శివసేన ఏర్పాటైంది. కేవలం మహారాష్ట్రీయుల ఉనికి, ప్రాధమిక హక్కుల పోరాటమే లక్ష్యంగా ఏర్పాటయ్యింది.

 

కానీ తర్వాత కాలంలో రాజకీయ అధికారం లేకపోతే తమ టార్గెట్ రీచ్ అవటం కష్టమని ఠాక్రే డిసైడ్ అయ్యారు. దాంతో శివసేన ముందుగా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అడుగుపెట్టింది. తర్వాత సాధారణ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపింది. ఆరంభంలో ఎవరితోను పొత్తులు పెట్టుకోనప్పటికీ తర్వాత్తర్వాత  పొత్తులు పెట్టుకుంటే కానీ విస్తరణ, ప్రభావం సాధ్యం కాదని గ్రహించింది.

 

అందుకనే బాల్ ఠాక్రే పొత్తులు పెట్టుకున్నారు. దాంతో ఒక్కసారిగా మహారాష్ట్రలో ప్రధానంగా ముంబాయ్ లో తీవ్ర ప్రభావం చూపటం మొదలైంది. శివసేన ఇప్పటి వరకు వివిధ ఎన్నికల్లో ప్రజాసోషలిస్టు పార్టీ,  కాంగ్రెస్, కాంగ్రెస్ (ఎస్), జనతా పార్టీ, ముస్లిం లీగ్, బిజెపి, ఆర్పిఐ, దళిత్ పాంథర్స్ పార్టీలతో పొత్తులు పెట్టుకుంది. అయితే ఎప్పుడు పొత్తులు పెట్టుకున్నా మిత్రపక్షంగా అధికారాన్ని షేర్ చేసుకునేది.

 

అలాంటిది  ఇపుడు మాత్రం సిఎం కుర్చీ తమకే కావాలని పట్టుబట్టింది. విచిత్రమేమిటంటే ఇప్పటి వరకు ఏ ఎన్నికలో కూడా ఠాక్రే కుటుంబం నుండి అసలు పోటినే చేయలేదెవరు. అలాంటిది మొన్నటి ఎన్నికల తర్వాత మాత్రం  ఠాక్రే కుటుంబం నుండి కచ్చితంగా సిఎం కుర్చీలో కూర్చోవాల్సిందే అని పార్టీ డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగానే పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే పోటి చేశారు.   29 ఏళ్ళ ఆదిత్య పోటి చేయటమే సంచలనమంటే ఏకంగా సిఎం కుర్చీ మీదే గురి పెట్టటం మరింత సంచలనంగా మారింది. శివసేన గనుక టార్గెట్ రీచ్ అయితే ఆదిత్య సిఎం అవ్వటం బహుశా దేశంలోనే పెద్ద సంచలనమవుతుందేమో ?

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: