తాజాగా వైఎస్‌ఆర్‌సిపి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఇటీవల ఒక న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ.. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా అభిమానం అని చెప్పాడు. మెగాస్టార్ ఫ్యామిలీ కి నేను ఒక పెద్ద ఫ్యాన్ ని.. చిన్నతనం నుంచే చిరంజీవి అన్నా పవన్ కళ్యాణ్ అన్నా బాగా అభిమానం.. వారు రాజకీయాల్లో ఉన్నప్పటి .... వారిపైన ఉన్న నా ప్రేమ అభిమానం ఎప్పటికీ అలాగే ఉంటాయని చెప్పారు.


కొన్ని రాజకీయ విషయాలలో పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకించాల్సి వచ్చింది అని అన్నారు. సినిమాల్లో చిరంజీవి మా అన్న అని చెప్పుకొన్న వ్యక్తి (పవన్ కళ్యాణ్).. రాజకీయాల్లోకి వచ్చాక మా నాన్న కానిస్టేబుల్ అని చెప్పుకోవడం డబుల్ స్టాండ్ అనిపించింది అని చెప్పుకొచ్చారు. 


పవన్ కళ్యాణ్ ఒక నిజమైన రాజకీయ నేత కాదన్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో సమస్యలు తీరవని చెప్పిన పవన్ ఇప్పుడు అదే ధర్నాలు చేస్తుడడం అతని ద్వంద ప్రమాణాలను చూపిస్తుందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోమని.. మా పల్స్ మాకు ఉంది అంటూ.. మా లీడర్ జగన్ మోహన్ రెడ్డి పై పూర్తి నమ్మకం ఉందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 


మాజీ ముఖ్యమంత్రి టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఒక అవకాశవాది అని ఏ చిన్న అవకాశం వచ్చిన దాన్ని రాజకీయాల కోసం వాడుకుంటారని అనిల్ విమర్శించారు. లోకేష్ అసలు రాజకీయాలకు తగిన వ్యక్తి కాదని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో టీడీపీ అన్నీ అబద్దాలే ఆడిందని.. కానీ వాళ్లలా కాకుండా చెప్పిన సమయంలోనే పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్.


మరింత సమాచారం తెలుసుకోండి: