ఇపుడిదే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ఇంతకీ ఆదిత్య ఠాక్రే సృష్టించబోయే రికార్డు ఏమిటి ? ఏమిటంటే అతిచిన్న వయసులోనే ముఖ్యమంత్రి అవటం. ఆదిత్య ఠాక్రే ప్రస్తుత వయస్సు కేవలం 29 సంవత్సరాలే కావటం గమనార్హం. 53 సంవత్సరాల వయస్సున్న శివసేన పార్టీ తరపున ఇప్పటి వరకూ ఏ ఎన్నికలో కూడా  ఠాక్రే కుటుంబం నుండి ఒక్కరు కూడా పోటి చేయలేదు.

 

అంటే ప్రత్యక్ష ఎన్నికల్లో దిగింది కూడా 29 సంవత్సరాల ఆదిత్య ఠాక్రేనే అన్నది ఓ రికార్డు అయితే సిఎం పీటంపై కూర్చుంటే అదింకో రికార్డవుతుందనటంలో సందేహం లేదు. ఎలాగంటే ఇంతచిన్న వయసులో సిఎంగా బాధ్యతలు తీసుకున్న నేతలు దేశంలో ఎవరు కూడా లేరనే చెప్పాలి.

 

పాండిచ్చేరికి  ఎంఒహెచ్ ఫరూఖ్ 29 ఏళ్ళల్లోనే సిఎం అయ్యారు. కాకపోతే పాండిచ్చేరి అన్నది అప్పట్లో కేంద్రపాలిత ప్రాంతమనే విషయం మరచిపోకూడదు. అలాగే అస్సాంలో ఆల్ అస్సాం గణపరిషత్ (ఆసు) అధ్యక్షుడు ప్రఫుల్ల కుమార్ మహంత 33 ఏళ్ళకే సిఎం అయిపోయారు.

 

అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఫెమా ఖండూ 36 సంవత్సరాలకే సిఎం అయ్యారు. అయితే పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రకు శరద్ పవార్ 38 ఏళ్ళకే సిఎం  కుర్చీలో కూర్చున్నారు. తర్వాత ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ కూడా 38 సంవత్సరాలకే ముఖ్యమంత్రి అయ్యారు.

 

అయితే వీరందరితో పోల్చుకుంటే ఆదిత్య ఠాక్రే మాత్రం ఇంకా 30 సంవత్సరాలు కూడా రాకుండానే సిఎం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఆదిత్య ఎన్నికల్లో పోటి చేయటమే మొదటిసారంటే ఏకంగా సిఎం కుర్చీలో కూర్చునే అవకాశం రావటమంటే మామూలు విషయం కాదు. అసలు సిఎం కుర్చీ కోసం శివసేన పట్టుబట్టడమే ఆదిత్య కోసమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శివసేన గనుక తమ టార్గెట్ రీచ్ అయితే ఆదిత్య దేశంలోనే యంగ్గెస్ట్ సిఎంగా చరిత్ర సృష్టించటం ఖాయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: