ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరిగిపోయిందని ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. అయితే అప్పుడప్పుడు రైళ్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని సార్లు పట్టాలు తప్పడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగితే..కొన్ని సార్లు ఫైర్ యాక్సిడెంట్లు అవుతున్నాయి.  అయితే చాలా అరుదుగా సిగ్నల్స్ ఇబ్బందుల వల్ల ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం జరిగింది. రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్‌పై ఉన్న బోగీలు పక్కకు ఒరిగాయి.


కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగివున్న ట్రైన్ వెనకనుంచి వస్తున్న మరో ఎంఎంటిఎస్ ట్రైన్.. ఢీకొట్టింది. ఈ ఘటనలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఆగి ఉన్న రైలుని మరో రైలు ఢీకొట్టింది. సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.  ప్రమాదం తీవ్ర స్థాయిలో లేకున్నా...బొగీలు పక్కు వొరిగిపోయాయి. దాంతో  రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


అయితే ఈ  ప్రమాదం  టెక్నికల్ సమస్యల వల్లే ఈ ప్రమాదం జరిగిటనట్లు అధికారులు చెబుతున్నారు. సాంకేతిక లోపంతో ఇంటర్ సిటీ ట్రైన్ ఉన్న ట్రాక్‌పైకి ఎంఎంటీఎస్ రైలు వచ్చినట్లు అధికారలుు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. బోగీల్లో ఉన్నవారిని బయటకు తీసుకొచ్చారు. గాయాలపాలైన వారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎంఎంటీఎస్ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రమాదం జరగడం ప్రయాణికులను భయాందోళనకు గురి చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: