అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం 
మధ్యాహ్నం 2.30 కి విచారణ. 
సమ్మె పై వేసిన పిటిషన్ తో పాటుగా ప్రైవేటు పర్మిట్ ల పై విచారణ జరపనున్న ఉన్నత న్యాయస్థానం.



రాష్ట ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారం చేయాలని హైకోర్టు మరలా మరోసారి విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో తామే మరో తీర్పు ఈ రోజు ఇస్తామని స్పష్టం చేసిన ధర్మాసనం. ప్రైవేటు పర్మిట్లపై స్టే కొనసాగుతోంది.




తెలంగాణ ఆర్టీసి స్థితిగతులపై హైకోర్టులో మరో అఫిడవిట్ ను  ప్రభుత్వం దాఖలు చేసింది ఆ వివరాలు...



మొత్తం ఆర్టీసీ బకాయిలు ₹ 2209.66 కోట్లు.
ఈ నెల 8వ తేదీ వరకు టీఎస్‌ఆర్టీసీ బకాయిల వివరాలు.
పీఎఫ్‌ బకాయిలు ₹ 788.30 కోట్లు.
క్రెడిట్‌ కోఆపరేటీవ్ సొసైటీ బకాయిలు ₹ 500.95 కోట్లు.
లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ (2014- 2018) ₹ 180 కోట్లు.
రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ సెటిల్‌మెంట్స్‌ ₹ 52 కోట్లు.
మోటారు వెహికిల్‌ యాక్టు (2017-2019) ₹ 452.36 కోట్లు.
హెచ్‌ఎస్‌డీ ఆయిల్‌ బిల్స్‌ రూ. 34.45 కోట్లు.
హెచ్‌వో, రీజియన్‌, జోన్‌ ఇతర బకాయిలు ₹ 36.40 కోట్లు.
ప్రైవేట్‌ బస్సుల సంస్థల బకాయిలు ₹ 25 కోట్లు.
ఆర్టీసీ బస్సు మరమ్మతుల బకాయిలు ₹ 60 లక్షలు.



గడచిన 38 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండగా..ఆర్టీసీని ఇంకా ఎంత కాలం, ఎన్నిసార్లు ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. కార్మికుల సమస్యల పరిష్కారానికి 47 కోట్ల రూపాయలు చెల్లించినా సమస్య తీరదని తేల్చి చెప్పింది.  ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వంలో విలీనంపై మొండి పట్టుతో ఉంటే చర్చలు సాధ్యం కావని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం సమర్పిస్తున్న అఫిడవిట్ పై హైకోర్టు ఎలా సందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: