పాకిస్తాన్‌ భారత్‌పై విషప్రచారం చేయడంలో ఎటువంటి  అవకాశాన్నీ కూడా వదులకోదు ఈసారి పాకిస్థాన్  మరో దుశ్చర్యకు పాల్పడింది. పాకిస్తాన్‌ వైమానికదళ యుద్ధ మ్యూజియం కరాచీలో వుంది ఇందులో  భారత వైమానికదళ వింగ్‌కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ బొమ్మను ప్రదర్శించింది. ఈ విషయాన్నీ పాకిస్తాన్ జర్నలిస్టు అన్వర్‌ లోధి శనివారం అర్ధరాత్రి తన ట్విటర్‌ ద్వారా కరాచీ మ్యూజియంలోని అభినందన్ బొమ్మ ఫొటోను షేర్ చేశారు.


ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో పాక్ అభినందన్‌ బొమ్మ పెట్టడం గమనార్హం. అయితే బొమ్మను ఏ ఉద్దేశ్యంతో పెట్టారో అన్వర్‌ తెలుపలేదు.వైమానికదళ యుద్ధ మ్యూజియంలో ఈ  అబినందన్ బొమ్మ ఈ విధంగా వుంది  అభినందన్‌ వర్ధమాన్‌ చుట్టూ పాక్‌సైనికులు చుట్టుముట్టి ఉండగా, ఎడమ పక్క ఒక టీ కప్పును కూడా ఉంచినట్టుగా   వుంది . వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ ఫిబ్రవరిలో జరిగిన బాలాకోట్‌ వైమానిక దాడుల సమయంలో పాకిస్తాన్‌ యుద్ధ విమానాలను వెంబడించాడు. ఈ ప్రక్రియలో  అభినందన్‌ వర్ధమాన్‌ నడుపుతున్న యుద్ధవిమానం పాకిస్తాన్‌ భూభాగంలో కూలిపోయింది.


అభినందన్‌ వర్ధమాన్‌ సురక్షితంగా బయటపడినప్పటికీ పాక్‌ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుంది. రెండు రోజుల వరకు అక్కడే పెట్టుకొని తర్వాత  అభినందన్‌ను తిరిగి భారత్‌కు అప్పగించింది. ఈ ఘటనపై అప్పట్లో సామాజిక మాధ్యమాల్లోనూ పాకిస్తాన్‌ వ్యంగ్య ప్రచారాన్ని చేసింది. తాజాగా అభినందన్‌ బొమ్మను మ్యూజియంలో ప్రదర్శించింది. దీనిని పాకిస్తాన్‌ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు అన్వర్‌లోధీ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

‘అభినందన్‌ బొమ్మ చేతిలో ఒక టీ కప్పు ఉంచితే బొమ్మకు మరింత పరిపూర్ణత వచ్చేది’అని లోధీ వ్యాఖ్యానించాడు. అభినందన్‌ పాకిస్తాన్‌ అదుపులో ఉన్నప్పుడు పాక్‌ సైన్యం విడుదల చేసిన ఒక వీడియోలో అభినందన్‌ టీ తాగుతున్నట్టుగా చూపించడంతో లోధీ ఈ వ్యాఖ్యలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: