హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలును మరో ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్ పైకి రైలు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. తృటిలో భారీ ప్రమాదం తప్పటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 
 
సిగ్నల్ చూసుకోకుండా ఆగి ఉన్న ట్రాక్ పైన ఉన్న  ట్రైన్ ను  ఎంఎంటీఎస్ ట్రైన్ ఢీ కొట్టింది.  హుటాహుటిన సిబ్బంది, రైల్వే శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
ముందు భాగంలో ఉన్న ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎంఎంటీఎస్ ట్రైన్ బోగీలు ఒరిగిపోయినట్లు తెలుస్తోంది. సాంకేతిక సమస్యల వలన ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఆగి ఉన్న ట్రైన్, ఎంఎంటీఎస్ ట్రైన్ చాలా నిదానంగా వెళ్లటం వలన పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది. రెండు రైళ్లు వేగంగా వెళ్లి ఉంటే మాత్రం పెను ప్రమాదమే జరిగి ఉండేదని తెలుస్తోంది. 
 
మొత్తం 6 బోగీలు వెనక్కు ఒరిగిపోయాయని తెలుస్తోంది. ప్రస్తుతం రైల్వే అధికారులు ట్రాక్ ను రిపైర్ చేసే పనులలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. ఈ మార్గంలో ప్రయాణించే రైళ్లను మళ్లించాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు. రెండు ట్రాక్ లపై ఎంఎంటీఎస్ రైలు బోగీలు పడటంతో ఫలక్ నామా, సికింద్రాబాద్ కు కాచిగూడ నుండి వెళ్లే రైళ్లను మళ్లించాల్సి ఉందని తెలుస్తోంది. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం వలన ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెబుతున్నారు. 


 




మరింత సమాచారం తెలుసుకోండి: