విశాఖపట్నం లో  పవన్ కళ్యాణ్  జనసైనికులతో భేటీ సందర్భంగా.. ఏపీ సీఎం జగన్‌పై వ్యంగాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. పులివెందులలో రాజధానిని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఆయన జగన్‌కు సలహా ఇచ్చారు.జనసేనాని చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు.

ప్రజలు సీఎంగా ఎన్నుకున్న జగన్‌ను పవన్ ఇలా విమర్శించడం సరికాదని హితవు పలుకుతున్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను కూడా పవన్ చదవలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.పవన్ చేసిన విమర్శలపై కత్తి మహేష్ ఘాటుగా స్పందించారు. ఏరా పవన్ కళ్యాణ్ అంటూ ఆయన పరుషమైన పదజాలాన్ని వాడారు.

‘‘ఏరా పవన్ కళ్యాణ్... పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండు కావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !!’’ అని ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.ఇదేం భాష మహేష్.. ఇలా మాట్లాడకు అని ఓ నెటిజన్ సూచించగా.. ‘‘పవన్ కళ్యాణ్ లాంటి బాధ్యతలేని బరితెగించి బానిసకు ఇంతకుమించిన మంచి భాష నా దగ్గరలేదు.

నిజానికి నేను చాలా మర్యాదగానే ఇప్పటికి రాస్తున్నా. మీరు చిత్తగించాలి’’ అని మహేష్ బదులిచ్చాడు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు రాజధాని రావాల్సిన విషయాన్ని గుర్తు చేశాడు.అంతకు ముందు పవన్ విశాఖ సభలో చేసిన వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ.. ‘‘ఇప్పటి వరకూ.. తీస్తా తీస్తా అనడమేగాని, వాడు తీసిన తాటా లేదు. తోలూ లేదు. తొక్కా లేదు. చిల్ చిల్. ఆల్రెడీ వాడిగా గుండు ఒకసారి. వేడిగా ఓటమి రెండుసార్లు తగిల్చి జనాలే తేల్చేశారు. ఇక ఆపమనండి ఈ మాడా యవ్వారాలు!’’ అంటూ కత్తి కామెంట్ చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: