అతనో  దివ్యాంగుడు... అయినప్పటికీ బాధ పడకుండా తన కాళ్ళ మీద తాను నిలబడాలని అనుకున్నాడు. ఓ మార్కెట్ యార్డులో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అయితే ఆ దివ్యాంగున్ని   ఉద్యోగం  మానేయాలంటే అధికార పార్టీ నేతల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఉద్యోగం  మానేయాలంటూ  భయబ్రాంతులకు గురి చేశారు. అయితే ఆ  వ్యక్తి  దివ్యాంగుడు అయినప్పటికీ పరువు గా బతుకుదామని జాబ్ చేస్తున్నప్పటికీ అధికార పార్టీ  నేతలు భయబ్రాంతులకు గురి చేయడంతో మనస్థాపం చెంది నిద్రమాత్రలు మింగాడు  అంతటితో ఆగకుండా పురుగుల మందు కూడా తాగి ఆత్మహత్య యత్నం  చేసుకున్నాడు. 



 వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా  తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు అబ్దుల్ రజాక్ అనే దివ్యాంగుడు. దివ్యాంగుడు  అయినప్పటికీ ఎక్కడ మనస్తాపం  చెందకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా జాబ్ మానేయాలంటూ  అబ్దుల్ రజాక్ కి  వేధింపులు మొదలయ్యాయి. అధికార వైసిపి నేతలు  బెదిరింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. చివరికి జాబ్ మానేయాలంటూ  హెచ్చరించారు. ఎంతకీ  ఆ దివ్యాంగుడు ససేమిరా అనడంతో వైసీపీ నాయకులు యార్డ్ ఉద్యోగులు కుమ్మక్కై తనను  ఉద్యోగం నుంచి తీసేసారు అంటూ ఆ తన ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ దివ్యాంగులు నిద్రమాత్రలు మింగి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం  చేసుకున్నాడు. అయితే ఆత్మహత్య చేసుకునే ముందు తాను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాను అనే విషయాన్ని ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు ఆ వ్యక్తి. 



 దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పురుగుల మందు తాగుతూ నిద్రమాత్రలు మింగి ఆ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని తను అధికార వైసీపీ నేతలు తనను  ఉద్యోగం  నుంచి తీసివేయడం వళ్లే  మనస్థాపంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని దివ్యాంగుడు తెలిపాడు. కాగా  విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అబ్దుల్ రజాక్ ను  హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రస్తుతం జిజిహెచ్ లో చికిత్స పొందుతున్నాడు బాదితుడు . అయితే దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే దీనిపై అధికార పార్టీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: