మహారాష్ట్ర రాజకీయాలు కీలకమైన మలుపులు తీసుకుంటున్నాయి. బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని స్పష్టం చేయటంతో మహరాష్ట్ర రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈరోజు ఉదయం పది గంటలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఈరోజు ఉదయం 11గంటలకు శరద్ పవార్ అధ్యక్షతన భేటీ మొదలైంది. 
 
బీజేపీ, శివసేన పార్టీలు విడివిడిగా వారి వారి పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ నవాబ్ మాలిక్ ఏ నిర్ణయం తీసుకున్నా ఎన్సీపీ పార్టీతో కలిసే తీసుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వర్గాలు సోనియా గాంధీతో సంజయ్ రౌత్ భేటీ అవనున్నట్లు చెప్పాయి. శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీ పెద్దలతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
శివసేన ఎన్డీఎ నుండి బయటకు వస్తే మాత్రమే తమ మద్దతు ప్రకటిస్తామని ఎన్సీపీ షరతు విధించిందని శివసేన ఎన్డీఎ నుండి బయటకు వచ్చిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈరోజు ఉదయం శివసేన ఎంపీ అరవింద్ సావంత్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్సీపీ పెట్టిన షరతుల వలనే అరవింద్ సావంత్ రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయం మేరకు మహారాష్ట్రలో నడుచుకుంటామని అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నేత సంజయ్ నిరుపమ్ మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా అస్థిరతకు మాత్రం తెరపడదని అన్నారు.సంజయ్ నిరుపమ్ 2020 సంవత్సరంలో తిరిగి ఎన్నికలు జరగొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు శివసేన శాసన సభాపక్ష నేత ఏక్ నాథ్ షిండే గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: