అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయ రెడ్డి ని  పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన  కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య  ఘటన తో రెవిన్యూ ఉద్యోగులందరూ  ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా  అటు  రెవెన్యూ ఉద్యోగ సంఘాలు కూడా ఈ ఘటనపై న్యాయం చేయాలంటూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. తహసిల్దార్ విజయ రెడ్డి హత్య చేసిన నిందితులు పెట్రోల్ బాటిల్ లో తీసుకెళ్లటం  ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారిపోయింది. దీంతో పెట్రోల్ బాటిల్ తో ఎవరు కనబడిన భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ను బాటిళ్లలో  అమ్మరాదంటూ నిర్ణయించింది. 



 అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఏ పెట్రోల్ బంకుల్లో బాటిల్ లో  పెట్రోల్ విక్రయించకూడదని  ఆదేశించగా పెట్రోల్ బంకుల్లో ఈ మేరకు బోర్డులు  కూడా ఏర్పాటయ్యాయి. అయితే మామూలుగా అయితే ఎక్కడన్నా బైక్ ఆగిపోతే..  లేకపోతే ఇంకేదైనా కారణంతోనో బాటిల్ తీసుకొని వచ్చి పెట్రోల్ పోయించుకుని వెళుతుంటారు ప్రజలు. కానీ ఇటీవల కాలంలో మాత్రం పెట్రోల్ బాటిల్లో తీసుకెళ్లి హత్యలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక తాజాగా అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయ రెడ్డి హత్య హత్య కలకలం రేపగ...  ఆపై కూడా రెండు మూడు పెట్రోల్ బెదిరింపులు ఘటనలు చోటుచేసుకున్నాయి. 



 ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్ ని బాటిల్ లలో విక్రయించడం పై పలు ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని ఏ పెట్రోల్ బంకుల్లో కూడా బాటిళ్లలో పెట్రోల్ విక్రయించరాదని  తేల్చి చెప్పేసింది. దీంతో రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో"నో  పెట్రోల్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్ "అంటూ బోర్డులు  దర్శనమిస్తున్నాయి. టు వీలర్ అయినా 4 వీలర్ అయినా  వాహనం తెచ్చి  పెట్రోల్ పోసుకోవాలని  బంకుల యజమానుల తేల్చి చెబుతున్నారు. కొత్తగా ప్రభుత్వం ఆంక్షలు విధించిందంటూ  వాహనదారులకు సూచిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: