కేంద్ర ప్రభుత్వం  ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణకు శుభవార్తను  అందించింది.మెడికల్ డివైసెస్ పార్కులకు  ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.ప్రభుత్వం  మేక్ ఇన్ ఇండియాను మరింత ముందుకు తీసుకుపోయేందుకు  ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో  మెడికల్ డివైసెస్ పార్కులు ఏర్పాటు చేసేందుకు ఇరు రాష్ట్రాల్లోనూ ఆయా  రాష్ట్ర ప్రభుత్వాలకు అడ్డంకులు తొలిగిపోయాయి. ఒక మెడికల్ డివైసెస్ పార్కును తెలంగాణాలో సంగారెడ్డి సమీపంలో  ఏర్పాటు చేస్తున్నారు. మరో మెడికల్ డివైసెస్ పార్కును ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో ప్రభుత్వం  ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం లభించిన కేంద్ర ప్రభుత్వ అనుమతులతో రెండు తెలుగు రాష్ట్రాలు మెడికల్ ఉపకరణాల ఉత్పత్తి కేంద్రాలుగా ఎదగనున్నాయి. 


 మెడికల్ డివైసెస్  అనగా   హాస్పిటల్స్, సర్జరీ, టెస్టింగ్ లాబరేటరీ ల్లో ఉపయోగించే పరికరాలుగా  పేర్కొంటారు.  భారత్ లో ఇప్పటి వరకు ఈ పరికరాల ఉత్పత్తి పెద్దగా జరగటం లేదు. వీటిని మనం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాము . దీంతో వీటి ధరలు అధికంగా ఉంటాయి. అందుకే మన దేశానికి విదేశి కంపెనీలను రప్పించి ఇక్కడే వీటిని తయారు చేయాలని   ప్రభుత్వాలు మెడికల్ డివైసెస్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాయి. 


మెడికల్ డివైసెస్ పార్కును తెలంగాణ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో సుమారు 550 ఎకరాల్లో భారీగా  ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీ ఎస్ ఐ ఐ సి) ఇప్పటికే 552 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. అయితే, ఇందులో 186 ఎకరాల్లో పూర్తిగా మెడికల్ డివైసెస్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. మరో 127 ఎకరాలను సాధారణ పరిశ్రమలకు కేటాయించారు. 50 ఎకరాల స్థలాన్ని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజషన్ ఆధ్వర్యంలోని మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించారు. 2017 జూన్ లోనే తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దీనిని భూమి పూజ చేసి ప్రారంభించారు. 


ఒక మెడికల్ డివైసెస్ పార్కును ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం సమీపంలో ఏపీ మెడిటెక్ జోన్ పేరుతో  అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం 200 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా శంఖుస్థాపన చేశారు. తొలుత ఇక్కడ  అవసరాల కోసం మెడికల్ డివైసెస్ ఉత్పత్తి చేయనున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: