ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. సీఎం జగన్ మాట్లాడుతూ ఈరోజు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 131వ జయంతి జరుపుకుంటున్నామని అన్నారు. నవంబర్ 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటామని అన్నారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి ఎవరంటే మనందరికీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు వినిపిస్తుందని అన్నారు. 
 
1947 నుండి 1958 వరకు దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ కొనసాగారని అన్నారు. ఒక దీపం గదికి వెలుగునిస్తే చదువుకున్న విద్యార్థులు కుటుంబానికి వెలుగును ఇస్తారని జగన్ అన్నారు, పేదరికం నుండి బయటపడాలంటే చదువులు ముఖ్యమని జగన్ అన్నారు. మన కుటుంబాల నుండి డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు రావాలని జగన్ అన్నారు. నా పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నానని జగన్ అన్నారు. 
 
ఈరోజు ఎక్కడ ఏ ఉద్యోగం రావాలన్నా కూడా ప్రపంచంతో పోటీ పడాలి. ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచంతో పోటీ పడలేమని జగన్ అన్నారు. వారం రోజుల క్రితం పాఠశాలలన్నీ ఇంగ్లీష్ మీడియంలో బోధించే విధంగా జీవో తెస్తే పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు ఎందుకు...? అని స్వరాలు వినిపించాయని జగన్ అన్నారు. చంద్రబాబు, పవన్, వెంకయ్యనాయుడు విమర్శలు చేశారని ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలు విమర్శలు చేశాయని జగన్ అన్నారు. 
 
చంద్రబాబు గారు మీ కొడుకు ఏ మీడియంలో చదివాడు..? మీ మనవడు ఏ మీడియంలో చదువుతున్నాడు...? వెంకయ్యనాయుడు కొడుకు, మనవడు ఏ మీడియంలో చదివారని జగన్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారి పిల్లలు ఏ మీడియంలో చదివారని జగన్ ప్రశ్నించారు. నవంబర్ 14వ తేదీన పాఠశాలలను మూడు దఫాలుగా విడదీసీ 15,000 పాఠశాలల్లో నాడు నేడు అనే కార్యక్రమం చేపట్టబోతున్నామని జగన్ అన్నారు. ప్రతి పాఠశాలలో అన్ని సౌకర్యాలను కల్పిస్తామని జగన్ అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: