తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలోని వివాదస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి ఆటంకాలు లేవనే చెప్పాలి. దీంతో ఆలయ నిర్మాణం ఎప్పుడు మొదలుపెడతారు అనే చర్చ కొనసాగుతుంది. ఈ తరుణంలో ఆలయ నిర్మాణానికి వచ్చే ఏడాది జనవరిలో భూమిపూజ ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. 


ఇక వచ్చే సంవత్సరం జనవరిలో మకర సంక్రాంతి రోజున భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరపబోతున్నారు అని అర్థం అవుతుంది.  సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అయోధ్య ట్రస్ట్‌ను త్వరగా ఏర్పాటుచేసి, అందరి సహకారంతో నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలియచేయడం జరిగింది. 


ఆలయ నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి  సంక్రాంతి శుభముహూర్తంగా భావిస్తోన్న ప్రభుత్వం.. ఆలోగా అన్ని ప్రక్రియలను పూర్తి చేస్తాము అని ఉన్నతాధికారి తెలిపారు. అంతేకాదు, 2022 యూపీ ఎన్నికల నాటికి ఆలయాన్ని దాదాపు పూర్తిచేస్తారని ఆయన తెలియచేయడం జరిగింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్న గోరక్ష్ పీఠ్ ముఖ్య లక్ష్యమైన మందిర్ ప్రాజెక్ట్ కోసం అన్ని పనులను ఉపసంహరించుకోవడం కచ్చితం అని తెలియచేయడం జరిగింది. 


మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం త్వరగా అమలుచేయాలని, గతంలో తమ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపుర తెలిపిన  నమూనా ప్రకారం మందిర నిర్మాణం చేయాలని వీహెచ్‌పీ డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. మందిర నిర్మాణంపై 1989లో వీహెచ్‌పీ చీఫ్ అశోక్ సింఘాల్ ఆదేశాలతో ప్రముఖ శిల్పి సొంపుర ఈ నమునాను రూపొందించారని, దేశవ్యాప్తంగా ఇది ప్రాచుర్యం పొందిందని ఆ సంస్థ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు. వీహెచ్‌పీ ఆఫీస్ బేరర్స్ ప్రకారం.. రాతి శిల్పాలు, భవనం స్తంభాల పనులు వేగంగా జరుగుతున్నాయని, వీటిని నిర్మాణానికి ఉపయోగించు కోవచ్చు అని తెలియచేయడం జరిగింది.  సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయంతో అయోధ్యలో ఆలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయని తీర్పు అనంతరం యోగి తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: