ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత కొన్ని రోజులుగా ఇసుక సమస్య పట్టిపీడిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత  కారణంగా భవన నిర్మాణ కార్మికులు అందరూ ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఉపాధి కరువై కుటుంబ పోషణ చేయలేక భవన నిర్మాణ రంగ కార్మికుల  కుటుంబాలన్ని  రోడ్డున పడుతున్నాయి. తినడానికి తిండి కూడా లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.భవన నిర్మాణ కార్మికులు  దీంతో మనస్తాపం చెందుతు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు . ఇక ప్రతిపక్షాలకు అధికార వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడడానికి కారణం జగన్ సర్కార్  అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. 



 రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నూతన ఇసుక విధానం పల్లె రాష్ట్రంలో ఇసుక కాళీ అయ్యిందని  విమర్శలు గుప్పిస్తున్నారు. గత కొంతకాలంగా రాష్ట్రంలో ఇసుక  రగడ రగులుతూనే ఉంది. అటు  ప్రతిపక్షాల విమర్శలు ఇటు అధికార వైసీపీ ప్రతివిమర్శలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాలన్నీ ఇసుక సమస్యను  సమస్యను  తీర్చాలంటూ నిరసన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు.. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ ఒక్కరోజు దీక్షలు చేపట్టగా... అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇక ఇసుక సమస్యపై చంద్రబాబు కూడా దీక్ష చేపట్టేందుకు సంకల్పించారు.



 అయితే తాజాగా ఇసుక సమస్యపై ఎస్వీబీసీ చైర్మన్, వైసీపీ ప్రధాన కార్యదర్శి పృథ్విరాజ్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఇంటి దగ్గర కృష్ణానదిలో దిగిన వైసీపీ ప్రధాన కార్యదర్శి పృథ్విరాజ్... తమకు ఇక్కడ ఇసుక తీయడం చాలా కష్టంగా ఉందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలా ఇస్తారో ఓసారి చూపించాలి  అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసి  ఓవైపు నదులు ప్రాజెక్టులు అన్ని  నిండుకుండలా తలపిస్తుంటే... ఇసుక తవ్వడం ఎలా సాధ్యం అవుతుంది అంటూ పృథ్వీరాజ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏర్పడిన కొత్త సమస్యను చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: