కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్, ఎన్నికల సంస్కర్తగా సుప్రసిద్ధులైన టీఎన్ శేషన్ ఇక మనకు లేరు.సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆదివారం (నవంబర్ 10) రాత్రి చెన్నైలో కన్నుమూశారు. శేషన్ పూర్తి పేరు తిరునళ్లై నారాయణ అయ్యర్ శేషన్. కేంద్ర ఎన్నికల సంఘానికి 10వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఆయన పనిచేశారు. 1990 డిసెంబర్ 12 నుంచి 1996 డిసెంబర్ 11 వరకు పదవిలో ఉన్నారు.

తన పదవి కాలంలో భారత ఎన్నికల ప్రక్రియలో ఆయన కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంచలన నిర్ణయాలతో రాజకీయ నేతలను గడగడలాడించారు.ఎన్నికల సంఘం అధికారిగా శేషన్ విధులు నిర్వర్తించి శేషన్ మంచిపేరు తెచ్చుకున్నారు. భారత ఎన్నికల సంఘానికి సరైన గుర్తింపు, గౌరవం తీసుకొచ్చారు. ఆయన మృతిపై పలు రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.


టీఎన్ శేషన్ తమిళనాడు క్యాడర్‌కు చెందిన 1955‌వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. భారత ఎన్నికల కమిషన్ అధికారిగా 1990 నుంచి 1996 వరకు పనిచేశారు. భారత ఎన్నికల కమిషన్‌కు ఆయన 10వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆయన హయంలో ఎన్నికలకు సంబంధించిన ఎన్నో సంస్కరణలను ఆయన చేపట్టారు..ఆయన దేశ దశ దిశను మార్చివేసే ఎన్నికల నిర్వహణలో అసాధారణ సంస్కరణలను తీసుకొచ్చారు.


దేశ ఎన్నికల కార్యాలయానికి ఆయన పదో ప్రధాన కమిషనర్. అప్పటిదాకా మూస ధోరణిలో సాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం పనితీరును సమూలంగా మార్చేశారు. ప్రధాన కమిషనర్ గా తన మార్క్ ఏమిటో చూపించారు.రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ధీశాలి దేశ ఎన్నికల వ్యవస్థలో శేషన్ కు ముందు.. శేషన్ కు తరువాత.. అనే పరిస్థితిని తీసుకొచ్చారు. సంస్కరణలను అమలు చేయడంలో రాజకీయ పార్టీల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ.. వెనుకంజ వేయలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: