ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి, జాతీయ విద్య, మైనారిటీ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వెంకయ్యనాయుడుల పై ఘాటుగా స్పందించారు.

చంద్రబాబు నాయుడు కుమారుడు ఏ మీడియంలో చదివాడు? ఆయన మనవడు ఏ మీడియంలో చదువుతున్నాడని ప్రశ్నించారు సీఎం జగన్.   ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన పిల్లలు లేదా మనమళ్లను ఏ మీడియం స్కూల్లో చదివించారు.. చదవిస్తున్నారని జగన్ ప్రశ్నించారు. అయ్యా పవన్ కల్యాణ్ గారూ... మీకు ముగ్గురు భార్యలు.. బహుశా నలుగురో, ఐదుమందో పిల్లలు. వాళ్లందరినీ ఏ మీడియంలో చదివిపిస్తా ఉన్నారో అడుగుతా ఉన్నాను.. ఏపిలో  ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదివించాల్సిన అవసరం ఉందన్నారు.

మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే, నష్టపోయేది మనమే కాదు మన రాష్ట్రం నష్టపోతుంది.  పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సిన అవసరం ఉందన్నారు. ఇంగ్లీష్‌ మీడియం స్కూళ్లల్లో చదివితేనే పోటీ ప్రపంచంలో గెలవగలరని  అందుకే ఏపిలో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ప్రవేశపెడు తున్నామన్నారు.  ఇందులో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.  మనం మన పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి.. మంచి చదువు. ఆ దిశగా అడుగులు వేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.

ప్రభుత్వ పాఠశాలల్లో రూపురేఖలు మార్చాలనే ‘నాడు- నేడు’ కార్యక్రమం అని చెప్పాం. ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు ల్యాబ్‌లు పెట్టాం అన్నారు సీఎం జగన్.  ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలోనే ఆ తర్వాత ప్రతి ఏడాది 7,8,9,10 నాలుగేళ్లలో పది వరకు అమలు చేస్తామని అన్నారు. అలాగే గతంలో ఫీజ్ రియాంబర్స్ మెంట్ విషయంలో పేద విద్యార్థులకు అన్యాయం జరిగింది.. త్వరలో పూర్తిస్థాయిలో ఫీజురీయంబర్స్‌మెంట్ ఇస్తామని ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మేథావులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: