గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుండి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్ సైట్ లో ఈ పేపర్ లో గౌరవ స్పీకర్ గారిని ఉద్దేశించి చాలా అసభ్యంగా స్పీకర్, స్పీకర్ వ్యవస్థని కించపరుస్తూ వాళ్లు ప్రచురించిన విధానాన్ని ప్రజలకు తెలియజేయాలని ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రవరిస్తుందో చెప్పాలని  మీడియా ముందుకు వచ్చానని జోగి రమేష్ అన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, తనయుడు లోకేశ్ కు బలహీన వర్గాలు అంటే అంత చులకన ఎందుకని జోగి రమేష్ ప్రశ్నించారు. బలహీనవర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్ స్థానంలో కూర్చుంటే ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారని జోగి రమేశ్ ప్రశ్నించారు. మీ అగ్రకుల అహంకారానికి పరాకాష్ఠ ఈరోజు అని జోగి రమేష్ అన్నారు. ఆంబోతులా తింటాడు, నిద్రపోతాడు అని మీరు వాడిన భాష సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉందని జోగి రమేష్ అన్నారు. 
 
సభ జరిగే సమయంలోనైనా, మిగతా సమయాల్లోనైనా స్పీకర్ స్థానాన్ని గౌరవించాల్సిన అవసరం మనకున్నదని జోగి రమేష్ అన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలుగుదేశం పార్టీ వాళ్లకు చెబుతున్నానని జోగి రమేష్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉంటే స్పీకర్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆ వ్యాఖ్యలను ప్రచురించినందుకు తెలుగుదేశం పార్టీ , పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, చంద్రబాబు తనయుడు లోకేశ్ బాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని జోగి రమేష్ అన్నారు. 
 
తెలుగుదేశ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, చంద్రబాబు తనయుడు లోకేశ్ బాబు స్పీకర్ కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరని పక్షంలో వీళ్లిద్దరి మీద క్రిమినల్ చర్యలు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి...? తీసుకోవాల్సిన అవసరం ఉంది అని జోగి రమేశ్ అన్నారు. స్పీకర్ స్థానంలో కూర్చోవటానికి బలహీన వర్గాలకు చెందిన వారు అర్హులు కాదా...? అని జోగి రమేష్ చంద్రబాబును ప్రశ్నించారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: