38వ రోజు సోమవారం ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమం జరుగుతోంది.ఆర్టీసీ కార్మికులు  తమ పరిస్థితిని సీఎంకు వివరించి ఆయనలో మార్పు తెచ్చేలా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చొరవ తీసుకునేలా చేసేందుకు దీనిని చేపట్టారు.


ఆర్టీసీ కార్మికులు, ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు అందరు కలిసి సిద్ధిపేటలో మంత్రి తన్నీరు హరిశ్‌రావు ఇంటి ముట్టడి చేయడానికి  ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరగడంతో ఓ కార్మికురాలు స్పృహ తప్పిపడిపోయింది. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.పోలీసులు అక్కడున్న  ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.తరువాత  ఆర్టీసీ కార్మికులు  సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరువు  ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్టీసీ కార్మికులు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికి తమ న్యాయమైన డిమాండ్లను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని  వినతి పత్రం సమర్పించారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి కూడా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యను విన్నవించుకున్నారు. 


ఇదే విధంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులతో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు అఖిలపక్ష నేతలు ప్రయత్నించగా  పోలీసులు అడ్డుకున్నారు.పోలీసులు ఆందోళనకారులను  అరెస్ట్‌ చేశారు. అదే విధంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని  కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో కలసి ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్షం నాయకులు వినతిపత్రం సమర్పించారు.

కామారెడ్డి జిల్లా  విప్ గంప గోవర్ధన్ ఇంటి ముట్టడికి ఆర్టీసీ కార్మికులు యత్నించగా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, విప్ గంప గోవర్ధన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ క్యాంప్‌ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టిడిం


మరింత సమాచారం తెలుసుకోండి: