వెలుగు వీవోఏల గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 8,000 రూపాయలు ప్రభుత్వం నుండి వీవోఏలకు చెల్లించనుండగా మిగిలిన 2,000 రూపాయలు గ్రామ సంఘాల ద్వారా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వచ్చే నెల నుండి ఈ ఉత్తర్వులు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహిళా స్వయం సంఘాలకు అనుబంధంగా పనిచేస్తున్న వీవోఏల ప్రధాన సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. 
 
వేతనాల పెంపుపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని, బకాయి వేతనాలు విడుదల చేయాలని వీవోఏలు గత కొన్ని నెలలుగా డిమాండ్ చేస్తున్నారు. వేతనాల పెంపు కొరకు ఆందోళనలు కూడా చేశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలు మంజూరు చేయడం, ప్రభుత్వ పథకాల అమలులో వీవోఏలు కీలకంగా వ్యవహరిస్తారు. గత కొన్ని రోజుల నుండి వీవోఏలు ఉద్యోగ భద్రత కావాలని, పెంచిన వేతనాలు అమలు చేయాలని ఆందోళన చేపట్టారు. 
 
గత కొన్ని నెలల నుండి వీవోఏలకు వేతనాలు సరిగ్గా అందడం లేదు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత వీవోఏల జీతాన్ని 10,000 రూపాయలకు పెంచుతానని హామీ ఇచ్చారు. సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, ఎన్నికల తరువాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
 
ప్రభుత్వం ఉత్తర్వులతో వీవోఏల జీతాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయటం పట్ల వీవోఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ప్రజలకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు మేలు జరిగేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకోవడం, తీసుకున్న నిర్ణయాలను అతి తక్కువ సమయంలోనే అమలు చేయటం పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: