జగన్ సర్కార్-విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై పొలిటికల్ హీట్ పెరుగుతోంది.  ఏపీ సీఎం ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటరిస్తూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింనందుకు విమర్శలు చేస్తున్న వారంతా వాళ్ల పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారో చెప్పాలన్నారు.

జగన్.‘చంద్రబాబు కొడుకు, మనవడు ఎక్కడ చదువుతున్నారు.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పిల్లలు, మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదవలేదా.. ముగ్గురు పెళ్ళాలు , నలుగురు ఐదుగురు పిల్లలున్న పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు’అంటూ సీఎం ప్రశ్నించారు.పవన్ వ్యక్తిగత జీవితంపైనా ఏపీ సీఎం వ్యాఖ్యలు చేశారంటూ జనసేన ఆరోపిస్తోంది. అయినా సరే సంయమనం పాటించాలంటూ ఆ పార్టీ పిలుపునిచ్చింది. జగన్ వ్యాఖ్యలపై జనసైనికులు స్పందించొద్దని ఓ ప్రకటన విడుదల చేసింది.


జనసేన తన ప్రకటనలో.. ‘ఏ.పీ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ రెడ్డి గారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారిపై చేసిన వ్యక్తిగత ఆరోపణలపై మన పార్టీ నాయకులు గాని జనసైనికులు గాని స్పందించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. భవన నిర్మాణ కార్మికుల కోసం మనం చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నాము. మన అధ్యక్షులు ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి గారు చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలు బాధాకరమైనప్పటికీ ప్రజా క్షేమం కోసం మనం భరిద్దామని శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు చెప్పారు.


మంగళవారం పవన్‌ కళ్యాణ్‌ విజయవాడ వస్తున్నారు. ఆ రోజు సాయంత్రం మీడియా సమావేశం.ఇదిలా ఉంటే.. జగన్ వ్యాఖ్యలపై జనసేన శతఘ్ని స్పందించింది. ఏపీ సీఎం వ్యాఖ్యలకు కౌంటరిస్తూ.. ఓ వీడియోను ట్వీట్ చేసింది. ‘మీ దొంగల ముఠా అంతా జైల్లో చిప్పకూడు తిన్నది కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ల వల్ల అంట నిజమా జగన్’అంటూ ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: