ఎవరికి ఐనా కళ్యాణం అంటే చాల ఆశలు ఉంటాయి. ఇదే తరుణంలో మహబూబ్‌నగర్‌కు చెందిన  వర్షిణి, అమెరికాలోని డల్లాస్‌కు చెందిన హెన్రి హుడ్‌ గిన్స్‌ల వివాహం హైదరాబాద్‌ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా జరిపారు. మహబూబ్‌నగర్‌కు చెందిన వర్షిణి హైదరాబాద్‌లో బీటెక్‌ పూర్తి చేసి నాలుగేళ్ల క్రితం అమెరికాకు వెళ్లడం జరిగింది. అక్కడ ఎంఎస్‌ పూర్తి కాగానే డల్లాస్‌లోని క్యాపిటల్‌ వన్‌ సంస్థలో జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగంలో చేరడం జరిగింది. అదే సంస్థలో సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌గా  పని చేస్తున్న హెన్రి హుడ్‌ గిన్స్‌తో  ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడం జరిగింది. ఇద్దరూ వివాహం చేసుకోవాలని  నిర్ణయం తీసుకున్నారు. 


ఈ వివాహము ఇద్దరి తల్లిదండ్రుల అంగీకారం మేరకు జరగాలని మాట్లాడుకోవడం జరిగింది. ఇరువురి తల్లిదండ్రులను ఒప్పించడానికి వీరికి సరిగ్గా సంవత్సర కాలము టైము కావల్సి వచ్చినది. ఎట్టకేలకు ఇద్దరి తల్లిదండ్రుల ఆమోదము లభించినది. ఏమైనా కానీ అమెరికా అబ్బాయి... పాలమూరు అమ్మాయి ఏడు అడుగులు వేసి ఒక్కటయ్యారు. .హిందూ సంప్రదాయం ప్రకారం హైదరాబాద్‌లో పెళ్లి చేయాలని నిర్ణయించారు. పెండ్లి కుమారుడు హెన్రి తరఫున అతని తల్లి, సోదరుడు హాజరుకాగా, వర్షిణి తరఫున ఆమె చిన్నాన్న, చిన్నమ్మతో పాటు దగ్గరి బంధువులు కూడా హాజరయ్యారు. 


ఇవాళ ఉదయం 11.15 గంటలకు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో వారిద్దరి వివాహం జరిగింది. వీరి వివాహమునకు హాజరైన వారు ఎలాగైనా అమెరికా అబ్బాయి తెలంగాణ అమ్మాయికి వివాహము జరిగి పోయింది అని జోక్ చేయడము విశేషము. వీరిద్దరి దాంపత్యం అన్యోన్యంగా ఉండాలని దీవించారు.తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దగ్గరుండి వారి వివాహం జరిపించడంతో పాటు వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళు ఎల్లపుడు బాగుండాలి అని అందరు కోరడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: