ఢిల్లీలోని జేఎన్యు లో  విద్యార్థులందరూ నిరసన బాట పట్టారు. మొత్తం  యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కలిసి నిరసనలో పాల్గొన్నారు.దీంతో జేఎన్యూ దద్దరిల్లింది.  యూనివర్సిటీలో మెస్  చార్జీలు డ్రెస్ కోడ్ పై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారీగా పెంచిన మెస్  ఛార్జీల వల్ల  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. భారీగా మెస్ చార్జీలు వసూలు చేస్తూ ఇబ్బందులకు  గురిచేస్తున్నారంటూ  ఆరోపిస్తున్నారు. దీంతో ఢిల్లీలోనే జేఎన్యూ వద్ద  పరిస్థితులు ఉద్రిక్తంగా  మారుతున్నాయి. 

 

 

 

 జేఎన్యూ విద్యార్థులందరూ నిరసన తెలుపుతుండటంతో జేఎన్యూ వద్దకు  వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థులందరినీ కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అయితే జేఎన్యూ దగ్గర  భారీగా మోహరించగా...  పోలీసులు వీసీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ నినాదాలు చేస్తున్నారు. దీంతో జేఎన్యూ వద్ద  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి . డ్రెస్ కోడ్ విషయంలో వీసీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. అంతేకాకుండా భారీగా పెంచిన మెస్చార్జీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. 

 

 

 

 దీంతో విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు జేఎన్యూ  దగ్గరికి భారీగా మోహరించిన పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో జైలు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసులు విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.జేఎన్యూ  క్యాంపస్ వద్ద  విద్యార్థులు పోలీసుల అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. విద్యార్థులు ఆందోళన తో ఒక్కసారిగా జేఎన్యూ  దద్దరిల్లిపోయింది. దీంతో అక్కడ పరిస్థితి మొత్తం టెన్షన్ టెన్షన్ గా మారింది. విద్యార్థులను కంట్రోల్ చేసేందుకు పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థులను ఇంటిలో కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థులు మరింత రెచ్చిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: