మహారాష్ట్ర రాజకీయాలలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న అనంతరం ఇప్పుడు మరొక విషయం విపరీతమైన సంచలనానికి దారి తీసింది. ఈరోజు 7 గంటల 30 నిమిషాలకు గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఇచ్చినా డెడ్ లైన్ పూర్తికానున్న నేపథ్యంలో లో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ను కలిశాడు. ముంబై లోని బాంద్రా నుండి ఒక పెద్ద హోటల్ లో ఎన్సీపీ అధ్యక్షుడు పవార్ ను కలిసిన థాక్రే శివసేన ముందుండి ప్రభుత్వాన్ని నడిపించేందుకు తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరించమని పవార్ ను కోరినట్లు సమాచారం.

బిజెపి మరియు శివసేన మధ్య పొత్తు కుదరక పోవడం, బిజెపి తాము ప్రభుత్వాన్నిన ఏర్పాటు చేయలేమని చెప్పేయడంతో గవర్నరు రెండవ అతిపెద్ద పార్టీ అయిన శివసేన ను గవర్నమెంట్ ఏర్పాటు చేయమని కోరిన విషయం తెలిసిందే. అయితే శివసేన గత నెల జరిగిన ఎన్నికల్లో 56 స్థానాల్లో విజయం సాధించగా పవార్ యొక్క ఎన్సీపీ 54 స్థానాలు మరియు కాంగ్రెస్ 44 స్థానాలు గెలుచుకున్నాయి. అంటే 288 సీట్లు ఉన్న మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కనీస మెజారిటీ 145 కాగా ఈ మూడు పార్టీల కనుక కలిస్తే 154 స్థానాలతో గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ వచ్చిన చిక్కు అంతా కాంగ్రెస్ తోనే. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న శరద్ పవార్ ఈరోజు సాయంత్రం లోపల తాము శివసేనతో కలవనున్నది లేనిది కాంగ్రెస్ తో మాట్లాడి ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడు ఢిల్లీలో ఒక పెద్ద భేటీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మహారాష్ట్రలోని తమ నాయకులతో మాట్లాడి శివసేన మరియు ఎన్సీపీ లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటారు.  మొదటినుంచి మహారాష్ట్రలో శివసేన మరియు కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న సైద్ధాంతిక విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ నేరుగా గవర్నమెంట్ లో పాలు పంచుకుంటుందా లేక విడిగా బయట ఉండి తమ మద్దతు ఇస్తుందా లేదా అన్నది వేచిచూడాలి. ఏదేమైనా ఈ రాజకీయాలు రానున్న కొద్ది గంటలు మహారాష్ట్రతో పాటు మొత్తం భారతదేశాన్ని ఉత్కంటలో పడేసి అనడంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: