దేశంలో ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల క‌న్నా దీన‌స్థితికి దిగ‌జారిపోయింది కాంగ్రెస్‌. ఇక క‌ర్నాక‌ట‌లో ఎక్కువ సీట్లు వ‌చ్చినా జేడీఎస్‌కు స‌పోర్ట్ చేసి పెద్ద బ‌ఫూన్ అయ్యింది. కేవ‌లం బీజేపీ అధికారంలోకి రాకూడ‌దు అన్న ఒక్క సూత్రంతోనే క‌ర్నాక‌ట‌లో అతి చిన్న పార్టీ అయిన జేడీఎస్‌ను స‌పోర్ట్ చేసిన కాంగ్రెస్... ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లోనూ అదే పంథాలో ముందుకు వెళుతోంది.


క‌ర్నాక‌ట‌లో కాంగ్రెస్ జేడీఎస్‌కు స‌పోర్ట్ చేయ‌డంతో బీజేపీకి ఎలాంటి అస్త్రాలు దొరికాయో ?  ఇప్పుడు కూడా మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ బీజేపీకి అవే అస్త్రాలు దొరికాయి. ఇక ఎన్నికల ప్రచారంలో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలను ఎండగట్టిన శివసేన వారితో కల్వడం బిజెపికి రాజకీయంగా పెద్ద అస్త్రం దొరకనుంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు తమ కలయికను ఏ ప్రాతిపదికన జనంలో సమర్థించుకోగలరన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న.


ఈ మూడు వేర్వేరు సైద్ధాంతిక విబేధాలు ఉన్న పార్టీలు. వీటిని క్యాష్ చేసుకుని రేపు మ‌హారాష్ట్ర‌లో బీజేపీ అతి పెద్ద హిందూత్వ పార్టీగా అవ‌త‌రించే ప్లాన్‌తోనే ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌లేదు. కర్నాటకలో తక్కువ సీట్లున్న జెడిఎస్ పార్టీకి సీఎం సీటిచ్చి చేసిన ప్రయోగం విఫలమైనా కూడా కాంగ్రెస్.. శివసేనకు మద్దతిస్తే.. ఏడాదిలోగా ప్రభుత్వం మారడమో.. ప్రభుత్వం కూలిపోవడమో జరుగుతుందని బిజెపి భావిస్తోంది.


రేప‌టి రోజున క‌ర్నాట‌క‌లో జ‌రిగిన‌ట్టే మహారాష్ట్ర‌లోనూ జ‌రిగితే అప్పుడు శివ‌సేన న‌మ్మ‌క‌ద్రోహం ప్ర‌జ‌ల ముందు ఉంచాల‌న్న‌దే బీజేపీ ప్లాన్‌. అప్పుడు ఈ సానుభూతితో పాటు.. ఈ అప‌విత్ర కూట‌మి క‌ల‌యిక‌ను జ‌నాలు చీ కొట్టి మ‌ళ్లీ బీజేపీని గెలిపిస్తే మ‌ళ్లీ కాంగ్రెస్ పెద్ద బ‌ఫూన్ అవ్వ‌డం ఖాయం. ఈ మూడు పార్టీల సంసారం ఎన్ని రోజులు ఉంటుందో ?  కూడా చెప్ప‌లేం.


అందుకే బీజేపీ సైతం తాను ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌కుండా .. ప్ర‌భుత్వం ఏర్ప‌డ్డాక వాళ్ల లుక‌లుక‌ల‌ను క్యాష్ చేసుకునేందు స‌రైన గేమింగ్‌తో ఉంద‌ని తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు ప్ర‌భుత్వం న‌డ‌ప‌లేక‌పోతే అప్ప‌డు ఈ మూడు పార్టీల‌ను స్మాష్ చేసి బీజేపీ విజృంభించ‌డం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: