ఒక్క రూపాయి.. కేవలం ఒక్క రూపాయికే కిలో చేపలు అమ్ముతున్నాడు ఓ చేపల వ్యాపారి. ఎక్కడ అని అనుకుంటున్నారా ? ఇంకా ఎక్కడ అంది తమిళనాడులోని శివాంగంగా జిల్లాలో కరైకుడికి చెందిన చేపల వ్యాపారి పి.మనోహరన్ ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు ఒక్క రూపాయికే చేపలు అమ్ముతున్నాడు. ఈ కాలంలో ఈ ఆన్లైన్ లో అన్ని తక్కువ ధరకే వస్తున్నాయి.. 


కానీ వ్యాపార దుకాణాల్లో అంత ఆఫర్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళకు మిగిలేదే రూపాయి. అయితే ఆ రూపాయి గురించి ఆలోచించకుండా ఈ వ్యాపారి ఒక్క రూపాయికే కేజీ చేపలు అమ్మడు. దీంతో జనాలు అందరూ ఒక్కసారిగా ఆ షాప్ ముందు క్యూ కట్టారు. అయితే ఏ వ్యాపారి అయినా ఒక ఆఫర్ ప్రకటించాడు అంటే అందులో కచ్చితంగా ట్విస్టు ఉంటుంది. 


ఈ ఒక్క రూపాయి చేపల్లో కూడా ఓ ట్విస్టు ఉంది. అదేంటంటే.. ఒక్క రూపాయికే చేపలు ఇస్తా అని.. అయితే తొలి వందమందికి మాత్రమే ఒక్క రూపాయికి కిలో చేపలు అని ప్రకటించాడు. దీంతో తెల్లవారుజామునే ఎంతోమంది చేపల ప్రియులు అతని దుకాణం ముందు క్యూకట్టారు. దీంతో వచ్చిన 520 మందికి ఒక్క రూపాయికే చేపలు అమ్మడు. 


అయితే ఈ ఆఫర్ వాళ్ళ తనకు డబ్బు వచ్చిందో రాలేదో తెలియదు కానీ అతడి వ్యాపారానికి మాత్రం టీవీ నుంచి వెబ్సైట్ వరుకు మాంచి ప్రచారం లభించింది. సోషల్ మీడియాలో అయితే ఒక్క రూపాయికే కేజీ చేపలు అని ట్రెండ్ సెట్ చేసింది. ఆఫర్ ప్రకటించడానికి కారణం.. రూపాయికే ఇడ్లీలు విక్రయిస్తున్న బామ్మే అని ఆ వ్యాపారి తెలిపాడు. 


ఈ ఒక్క రూపాయికే కేజీ చేపల గురించి వ్యాపారి మాట్లాడుతూ.. ''స్టోరేజ్‌లో పెట్టిన చేపలను అమ్మడం నాకు ఇష్టం లేదు. ఎప్పటికప్పుడు తాజా చేపలనే విక్రయిస్తాను. చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది అని తెలిపేందుకే ఈ ఆఫర్ ప్రకటించాను అని, కరైకుడిలోని బర్మ కాలనీలో ఏర్పాటుచేసిన దుకాణంలో తొలి వంద మందికి మాత్రమే రూపాయికి కిలో చేపలు ఇస్తానని ప్రకటించాను. కానీ, అక్కడికి 500 మందికి పైగా వచ్చారు. దీంతో అందరికీ రూపాయికే కిలో చేపలను ఇచ్చేశాను’’ అని ఆ వ్యాపారి తెలిపాడు. ఈ మాటలు విన్న నెటిజన్లు, ప్రజలు అతని మంచితననాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: