ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది వైసీపీ.  ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.  అయితే ఎన్నికల ముందు వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్ప’ యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు.  ప్రజలు పడుతున్న కష్టాలు దగ్గరుండి చూశారు.  ఈ నేపథ్యంలో ఆయన నేను విన్నాను..నేను ఉన్నాను అనే నినాదంతో ప్రజలకు భరోసా ఇచ్చారు. దాంతో ప్రజలు ఈసారి ఎన్నికల్లో జగన్ పై గట్టి నమ్మకాన్ని పెంచుకున్నారు.  ఏపిలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయాన్ని కట్టబెట్టారు.  అయితే సీఎం జగన్ మంత్రి వర్గంలో నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ కీలక బాధ్యతలు నెరవేరుస్తున్నారు. 

ఏపిలో అనీల్ కుమార్ ని ఫైర్ బ్రాండ్ అని అంటారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అధికార పక్షాన్ని నిలదీసి..కడిగేసేవారు.  ఆయన అసెంబ్లీలో మాట్లాడితే..ఎదుటివారు కిమ్మనకుండా ఉండే స్థాయిలో వాదించేవారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తన రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర విషయాలు తెలిపారు. వృత్తిరీత్యా వైద్యుడినైన తాను రాజకీయాల్లోకి వస్తానని ఏ రోజూ అనుకోలేదని, కానీ అనుకోని ఘటనలు ఎదురు కావడంతో తన జీవితంలో అనూహ్య మలుపులు చోటుచేసుకున్నాయని చెప్పారు. నేను డాక్టర్ కోర్సు చదివినా..ప్రాక్టీస్ మాత్రం ఎప్పుడూ చేయలేదు. అయితే మా నాన్నగారు చనిపోవడంతో డెంటిస్ట్‌గా వెళ్లేందుకు మనసు అంగీకరించలేదు.

ఆ సమయంలో మా ఇంటికి వచ్చిన వారు మీ బాబు మెడిసన్ చదివారు..ఇప్పుడు ఏం చేస్తున్నారని అడిగే ప్రశ్నలకు మా అమ్మఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉండేవారు.  ఆ సమయంలో నారాయణ కళాశాలలో ఉద్యోగం కోసం వెళ్లానని చెప్పారు. అయితే వారు మూడు నెలలు ఆగి వస్తే చెబుతామనడంతో అక్కడ చేరే అవకాశం రాలేదన్నారు.  ఇదే సమయంలో మా బాబాయి చనిపోవడం..అనుకోకుండా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే నారాయణ కళాశాలలో ఉద్యోగం వచ్చి ఉంటే నా పరిస్థితి ఎలా ఉండేదో? కానీ అనూహ్యంగా అదే నారాయణపై పోటీ చేసి గెలిచానని తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: