అయ్యా గజిని  వైఎస్ జగన్ గారూ, మీ పవిత్ర పత్రిక, మీరు గతంలో తెలుగు పరిరక్షణ కోసం యుద్ధం చేసారు గుర్తులేదా ? నగరపాలక పాఠశాలల్లో టీడీపీ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలి అని ప్రణాళిక సిద్ధం చేస్తే ఆరోజు మీరు అడ్డుపడ్డారు. 'ఎందుకింత తెగులు?', 'తెలుగు లెస్సేనా?' అంటూ ఉద్యమం చేసిన రోజు మీ బుద్ధి ఏమయ్యింది? జగన్ గారూ! 'ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగే ముద్దు' అని మీరు ఉద్యమం చేసినప్పుడు మీ అమ్మాయిలు తెలుగు మీడియంలో చదివారా? అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.


ఆ ట్వీట్ ప్రకారం ఆయన చేసిన వాదన బాగానే ఉంది కాని... విజనరీ లీడర్ చంద్రబాబు అని పదే పదే చెప్పుకునే ఆయన, ఆయనను అభిమానించే వారు, గతంలో చంద్రబాబు నగరపాలక బడుల్లో ఈ విధానాన్ని ఏ విధంగా ప్రవేశ పెట్టారు ? అప్పుడు చంద్రబాబు చేసిన ఆలోచనలో వాళ్లకు తప్పు కనపడలేదా ? గట్టిగా మాట్లాడితే వాళ్ళ ఆలోచనే కదా ఇప్పుడు జగన్ చేసింది ? ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు లోకేష్ బురద జల్లడం, దానికి తెలుగుదేశం నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి భజన చేయడం హాస్యాస్పదమని పలువురు అంటున్నారు.


జగన్ చేసిన ఆలోచన ప్రకారం ఒక్కసారి చూస్తే... ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ లో పరుగులు పెడుతోంది. ఈ విషయం తెలియకుండా పదే పదే విమర్శలు చేయడం, ట్వీట్లు చేయడం అర్ధం లేని విమర్శే. ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం తప్పు దీని కారణంగా మా పిల్లలు నష్టపోయే అవకాశం ఉందని ఏ ఒక్క తల్లి తండ్రులు రోడ్డు మీదకు వచ్చి ధర్నా చేసిన సందర్భం లేదు. ఇక పాఠాలు చెప్పే టీచర్లు కూడా దీనిపై విమర్శలు కూడా చేయలేదు. కానీ కాలం చెల్లిన విమర్శలు చేసుకునే టీడీపీ నేతలు మాత్రం రాజకీయ లబ్ది కోసం ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయం వినపడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: