తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన సామర్ధ్యం విషయంలో అనేక అనుమానాలు సొంత పార్టీ నేతలే వ్యక్తం చేశారు. రాజధానికి మా మద్దతు ఉందని ఊదర గొట్టే టీడీపీ నేతలకు ఈ ఓటమి ఊహించని షాక్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో అప్పటి వరకు హడావుడి చేసిన కొన్ని భజన సంఘాలు ఈ ఓటమి తర్వాత దాదాపుగా సైలెంట్ అయిపోయాయి. ఈ విష‌యంలో ఎలాంటి డౌట్ లేదు. లోకేష్ ఓటమిని కులానికి అంట గట్టే ప్రయత్నం కూడా చేశారు.


అయితే లోకేష్ విషయంలో స్థానిక నేతలు కూడా ఇప్పుడు అసహనంగా ఉండి ఆయనకు సహకరించడం లేదనే అభిప్రాయం వినపడుతుంది. ఓటమి తర్వాత కూడా కోవర్టులు అంటూ నమ్మిన వాళ్లనే లోకేష్ ఆవేశంగా పక్కకు పంపించి భజన చేసే వాళ్లకు ఎక్కువగా విలువ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనితో నమ్ముకున్న వాళ్ళు నమ్మిన వాళ్ళను తట్టుకోలేక దూరం జరిగిపోయారు. ఇప్పుడు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళగిరిలో కూడా లోకేష్ ఆ కార్యక్రమాలు చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో నియోజకవర్గ నేతలు ఆయనకు సహకరించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, దీనితో లోకేష్ అక్కడి నుంచి పెనమలూరు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. లేదా వచ్చే ఎన్నికల్లో గద్దె రామ్మోహన్ ని గన్నవరం పంపించి విజయవాడ తూర్పు నుంచి తాను పోటీ చెయ్యాలని లోకేష్ భావిస్తున్నారట. ఒక వేళ అవినాష్ కూడా పార్టీ వీడ‌తాన‌ని బెదిరిస్తోన్న నేప‌థ్యంలో అవినాష్‌కు అత‌డి సొంత నియోజ‌క‌వ‌ర్గం తూర్పు ఇస్తే తన‌కు పెన‌మ‌లూరే సేఫ్ అని భావిస్తున్నాడ‌ట‌.


ఇక మంగ‌ళ‌గిరిలో స్థానిక నేతల సహకారం లోకేష్ కి అందడం లేదని, భజన పరులకు లోకేష్ ఎక్కువ విలువ ఇస్తున్నారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. ఇక ఇక్క‌డ ప‌ద్మ‌శాలీ వ‌ర్గం కూడా లోకేష్ ఇక్క‌డ తిష్ట‌వేస్తాడ‌న్న భ‌యంతోనే మొన్న‌టి ఎన్నిక‌ల్లో స‌రిగా ఓట్లు వేయ‌లేదు. ఇప్పుడు కూడా వారు స‌హ‌క‌రించే ప‌రిస్థితి లేదంటున్నారు. ఈ తరుణంలో ఆయన నియోజకవర్గం నుంచి బయటకు ఎంత త్వరగా వస్తే అంత మంచిది అనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: