ప్రశ్నిస్తాను అంటూ పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్...ముందు తనని తాను ప్రశ్నించుకుంటే చాలా బాగుంటుందేమో. ఎందుకంటే పవన్ కల్యాణ్ కూడా స్వార్ధపు రాజకీయాల్లో ఆరితేరిపోయారు. గత ఐదేళ్లు చంద్రబాబుతో చేసిన సావాస దోషమో లేక రాజకీయాల్లోకి వస్తే ఇంతేనేమో గానీ...పవన్ కల్యాణ్ తన స్వార్ధం కోసం రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. దీనికి చాలానే ఉదాహరణలు కంటికి కనబడుతున్నాయి. గత ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వం ఏ తప్పు చేసిన పవన్ నోరు మెదపలేదు. చివరిలో హడావిడి చేసిన అది ఎన్నికల కోసమే అని అర్ధమైపోయింది.


అయితే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి పవన్ తీవ్ర విమర్శలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ విమర్శించిన పవన్....ఇప్పుడు అధికారంలో ఇంకా విరుచుకుపడుతున్నారు. కాకపోతే ఇదే సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ని మాత్రం పవన్ పల్లెత్తి మాట అనడం లేదు. ఓ వైపు జగన్ లాంటి పాలన కావాలని అక్కడ ప్రజలు, ప్రతిపక్షాలు కోరుకుంటుంటే పవన్ దానికి రివర్స్ లో ఉన్నారు.


ఇటీవల జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని తీసుకున్న నిర్ణయంపై పవన్ విమర్శలు చేశారు. ఈ విషయంలో పక్క రాష్ట్రంలోని కేసీఆర్ ని చూసి జగన్ నేర్చుకోవాలని చెప్పారు. ఈ విషయంలో కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలన్న పవన్....చాలా విషయాల్లో జగన్ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని ఎందుకు చెప్పలేదో అర్ధం కావడం లేదు. ఇక్కడ జగన్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. తెలంగాణలో కూడా చేయాలని అక్కడవారు గొడవ చేస్తున్నారు.


అలాగే ఇక్కడ రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టుల్లో ప్రజా ధనాన్ని ఆదా చేస్తున్నారు. ఇదే తెలంగాణలో కూడా చేయాలని అక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్ కోరుతుంది. అలాగే కేసీఆర్ ఇష్టారాజ్యంగా పక్క పార్టీ ఎమ్మెల్యేలని లాగేసుకున్నారు. కానీ జగన్ మాత్రం పార్టీలోకి వస్తే పదవికి రాజీనామా చేసి రావాలని రూల్ పెట్టారు. ఇవేగాక అనుభవం ఉన్న కేసీఆర్ చేయలేని చాలా పనులు తొలిసారి సీఎం అయిన జగన్ చేసి చూపిస్తున్నారు.
అయితే ఇవే విషయాల్లో పవన్...కేసీఆర్ ని ప్రశ్నించ లేకపోతున్నారు. పైగా ఏ సమస్య ఉన్న తెలంగాణలో సాఫ్ట్ గా చెబుతున్నారు. ఇక ఇలా ఉండటానికి కారణాలు కూడా లేకపోలేదు. పవన్ ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. దీంతో జగన్ పై ఓ ఫైర్ అయిపోతున్న పవన్....కేసీఆర్ మీద ప్రేమ కురిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: