మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి ఓ కొలిక్కివ‌చ్చింది.అక్టోబరు 24న ఎన్నికల ఫలితాలు రాగా.. 18 రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పాటుపై ఓ క్లారిటీ దిశగా అడుగులు పడుతున్నాయి. 50:50 ఫార్ములాకు ఓకే అంటే బీజేపీతో కలిసి రెండున్నరేళ్లు యువ‌నేత ఆదిత్యను సీఎం చేయాలని చూసింది. కానీ బీజేపీ ఆ ప్రపోజల్‌కు ససేమిరా సహకరించకపోవడంతో కేంద్రంలోనూ శివసేన బైబై చెప్పేసింది. ఎన్డీఏ నుంచి బయటకొచ్చేసింది. తమ పార్టీ ఎంపీతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయించింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఓకే అనడంతో సిద్ధాంత భేదాలను కూడా పక్కనపెట్టి హస్తం పార్టీ (కాంగ్రెస్) కూడా షేక్ హ్యండ్ ఇచ్చేందుకు రెడీ అయిందని సమాచారం వస్తోంది.


సోమవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు ఓకే చెప్పాక ఆదిత్య సహా పలువురు నేతలు మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అయితే అందుకు మరో 48 గంటల సమయం ఇవ్వాలని కోరారు. శివసేన, ఎన్సీపీ అధికారాన్ని పంచుకుంటాయని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రభుత్వంలో చేరకుండా బయటి నుంచే మద్దతు ఇచ్చేందుకు రెడీ అయింది. శివసేన చీఫ్ ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య సీఎం కావడం ఖాయం అని తెలుస్తోంది.


కాగా, శివసేనకు మద్దతుపై కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే తమ నిర్ణయం ఉంటుందని ఎన్సీపీ ప్రకటించింది. శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన పార్టీ కోర్ కమిటీ భేటీలో ప్రభుత్వ ఏర్పాటు, మద్దతు అంశాలపై చర్చించినట్లు  ఆ పార్టీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. సీడబ్ల్యూసీ తీసుకోబోయే నిర్ణయం కోసం తామ పార్టీ ఎదురు చూస్తోందని ఆయన తెలిపారు.

ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకే కేంద్ర కేబినెట్‌ నుంచి వైదొలిగినట్టు శివసేన ఎంపీ అర్వింద్‌ సావంత్ ప్రకటించారు. 50-50ఫార్ములాపై బీజేపీ దాటవేత దోరణి నచ్చలేదంటున్న ఆయన..రాజీనామా లేఖను ప్రధాని కార్యాలయానికి పంపనున్నట్టు తెలిపారు. కేంద్రమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన సావంత్‌..మీడియాకు రాజీనామా లేఖను చూపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: