మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో రోజుకో ట్విస్ట్  తెర మీదికి వస్తుంది. రెండున్నర సంవత్సరాల పాటు శివసేన అభ్యర్థి సీఎం గా ఉండాలని శివసేన పార్టీ డిమాండ్ చేయడంతో బిజెపి శివసేన మధ్య ఉన్న పోతుంది విభేదించింది . అటు  మహారాష్ట్ర ప్రజలు ఏ పార్టీ కి కూడా ప్రభుత్వ ఏర్పాటుకు సరైన మద్దతు కట్టబెట్టకపోవడంతో శివసేన పార్టీ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీ  రోల్ పోషిస్తోంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో శివసేన పార్టీ నాయకుడు సీఎం గా ఉండాలని శివసేన పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకి తీవ్ర కసరత్తు చేస్తోంది శివసేన పార్టీ. దీనికోసం ఎన్సీపీ కాంగ్రెస్ ల తో చర్చలు కూడా జరుపుతుంది. ఇక తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని శివసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. 

 

 

 

 ఈ మేరకు గవర్నర్ భగత్ సింగ్ కోషియారాకీ  తమ అంగీకార పత్రాన్ని అందించింది  శివసేన. మహారాష్ట్రలో  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఉద్దేశం  ఉంటే 24 గంటల్లో తెలియపరచాలని గవర్నర్ గడువు ఇవ్వడంతో ఈ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది శివసేన. ఈ క్రమంలో గవర్నర్ దగ్గరకు వెళ్ళిన శివసేన యువనేత ఆదిత్య థాక్రే మరి కొందరు ముఖ్య నేతలు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లు గవర్నర్ కు  తెలియజేశారు. అయితే ఇతర పార్టీల మద్దతు కోసం చర్చలు జరుపుతున్నామని దీనికోసం మరో 48 గంటల గడువు కావాలని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఆలస్యం చేయడం తమ ఉద్దేశం కాదని... వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఆదిత్య థాక్రే చెప్పారు. ఇదిలా ఉండగా శివసేన మహారాష్ట్రలో  ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఎన్సీపీ కాంగ్రెస్ తో చర్చలు జరపగా ... ఎన్సీపీ  కాంగ్రెస్ మద్దతు లభిస్తున్నట్లు సమాచారం.

 

 

 

 అయితే అటు కాంగ్రెస్ బయటినుంచి  నుంచి   మద్దతివ్వాలని భావిస్తున్నట్లు  తెలుస్తోంది. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అయితే శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని కూడా భాగం చేసి  ఎన్సీపీ  కాంగ్రెస్ పార్టీలకు చెరో డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. కాగా  మహారాష్ట్ర లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: