ఏపీలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమలు చేయడానికి జగన్ సర్కార్ జివో జారీ చేసిన సంగతీ తెలిసిందే. అయితే ప్రతి పక్షాలు తీవ్ర స్థాయిలో రియాక్ట్ అయ్యాయి. అయితే మనం ఒక వైపు అదే తప్పు చేస్తూ ..మళ్ళీ పక్కనున్న వారి దగ్గరి కి వెళ్లి నువ్వు చేసేది తప్పు అంటే ..వారు వింటారా చెప్పండి. నువ్వు చేస్తే సంసారం ..నేను చేస్తే వ్యభిచారం అని అడుగుతారు. కాబట్టి మనం దేని గురించైనా మాట్లాడే ముందు .. ఆ విషయం లో మనల్ని ఎదుటువారు ప్రశించకుండా చూసు కోవాలి. కానీ ఈ విషయం లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్  కళ్యాణ్ ఉప రాష్ట్ర పతి వెంకయ్య నాయుడు గారు ఇంకా కొంచెం అభివృద్ధి చెందాలి. కొత్త గా అధికారంలోకి వచ్చిన వైసీపీ  ఆంధ్రప్రదేశ్ లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ప్రవేశ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది.


అయితే జగన్ సర్కార్ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తే మరికొందరు విమర్శిస్తున్నారు. తెలుగు భాష ని కాపాడాలి అని ఒకరు తెలుగు ని నాశనం చేస్తుంటే ..తెలుగు భాష పరి రక్షణా సమితి ఎక్కడా అని కొందరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యల పై సీఎం జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలి లో స్పదించారు.మౌలానా ఆజాద్ జయంతి వేడుక ల్లో పాల్గొన్న సీఎం..  మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు కుమారుడు ఏ మీడియంలో చదివాడు? ఆయన మనవడు ప్రస్తుతం ఏ మీడియం లో చదువుతున్నాడని జగన్ ప్రశ్నించారు. 


మన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడును కూడా జగన్ వదిలిపెట్టలేదు.  .. మీ మనవళ్లు ఏ మీడియం స్కూళ్లో చదువుతున్నారంటూ ప్రశ్నించారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలకు  సమాధానమిచ్చారు సీఎం వైఎస్ జగన్... యాక్టర్ పవన్ కల్యాణ్ కు ముగ్గురు భార్యలు బహుశా నలుగు రో ఐదుగు రో పిల్లలు అనుకుంటా.. వారంతా ఇప్పుడు ఏ మీడియం స్కూల్ లో చదువుతున్నారంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుత రోజుల్లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లల్లో చదివితేనే పోటీ ప్రపంచం లో గెలవ గలరని స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: