సమాజంలో ఉద్యోగాలు చేసుకుంటున్న వారు కొంతలో కొంత ఆనందంగా బ్రతుకుతుంటే, అధిక శ్రమను ఓర్చుకుని కష్టపడే  రైతు కంట కన్నీరు వస్తుంది. తాను పండించే పంటను కన్న బిడ్డకంటే ప్రేమగా చూసుకుంటారు రైతులు. రైతే లేకపోతే అసలు మనుషులే జీవించరు అన్నది నగ్న సత్యం. ఇలాంటి రైతుకు తాను పడిన కష్టానికి తగ్గ ఫలితం లభించక ఎప్పుడు దగా పడుతుంటాడు. ఇప్పుడు ఉల్లి రైతు పరిస్దితి ఇలాగే మారింది.


ఒకవైపు దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కొండెక్కి వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తుంటే. మరోవైపు మహారాష్ట్ర ఉల్లి రైతులు పండించిన పంటకు కనీస  విలువ లభించక లబోదిబో మంటు కన్నీరు మున్నీరవుతున్నారు. దేశవ్యాప్తంగా కిలో ఉల్లి ధర సుమారు రూ.100 పలుకుతోంటే..అహ‍్మద్‌ నగర్‌కు చెందిన  రైతుకు లభించింది మాత్రం రూ. 8. దీంతో సంక్షోభంలో కూరుకు పోయిన రైతు పొలం నుంచి ఉల్లిపాయను తీసే కార్మికులకు ఏమి చెల్లించాలి, కుటుంబ అవసరాలు ఎలా తీర్చాలి? తన బిడ్డల్ని ఎలా పోషించాలంటూ కన్నీరు పెడుతున్న వైనం పలువుర్ని కదిలిస్తోంది.


దళారుల దగాలో ఇలాంటి రైతులు పాపం ఎందరో అన్యాయం అవుతున్నారు. ఇలాంటి వారికి సరైన న్యాయం జరుగుతే మార్కెట్లో కనీస లాభంతో పండించిన సరకులను అమ్ముకుని వారు బాగుపడుతారు. సామాన్యులకు  ధరలు అందుబాటులో ఉంటాయి. ఇకపోతే విపరీతంగా పెరిగిన ఉల్లి ధరను నియంత్రించే దిశగా కేంద్రం ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇందుకు గాను లక్ష టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుని దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని నిర్ణయిచింది.


దిగుమతి చేసుకున్న ఉల్లిని నవంబర్ 15 నుండి  డిసెంబర్ 15 మధ్యకాలంలో దేశీయ మార్కెట్లో పంపిణీ చేయడానికి ఎంఎంటీసీని కోరామని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ ఇటీవల ప్రకటించారు కూడా.. ఇప్పుడు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు పడే బాధలు ఇకనైన ప్రభుత్వాలు అర్ధం చేసుకుని రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: