మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా  వేడెక్కాయి . కాంగ్రెస్ మద్దతు తో శివసేన , ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి .  ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నిరాకరించడంతో , శివసేన ను   ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి ఆహ్వానించి విషయం తెల్సిందే .  శివసేన, ఎన్సీపీ కూటమి  ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.  ఈమేరకు సీడబ్ల్యూసీ సమావేశంలో సమాలోచనలు జరిపిన కాంగ్రెస్ పార్టీ నేతలు,  శివసేన సర్కార్ కు  బయటి నుంచి మద్దతు ఇవ్వాలని తీర్మానించారు.


  శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరుతూ ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరేకాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఫోన్ చేశారు . థాకరే విజ్ఞప్తిపై  సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించిన తరువాత, శివసేన ప్రభుత్వానికి బయటి  నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది .  దీంతో శివసేనఎన్సీపీ కూటమి  ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడంతోపాటు,  సీఎంగా ఉద్దవ్ థాకరే  ఉంటే బాగుంటుందని సోనియాగాంధీ సూచించినట్లు సమాచారం .  ముఖ్యమంత్రి పదవికి ఆదిత్య థాకరే  పేరును శివసేన నాయకత్వం  పరిశీలిస్తున్న విషయం తెల్సిందే .


 కాంగ్రెస్ పార్టీ తమ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించగానే , శివసేన  నేతలు అప్రమత్తమయ్యారు.  ఆ పార్టీ నేతలు ఏక్ నాథ్  షిండే,  ఆదిత్య థాకరే లు  మహారాష్ట్ర గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధమేనని తమకున్న ఎమ్మెల్యేల  బలాన్ని వివరించారు . తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శివసేన కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే.  బీజేపీకి 105 స్థానాల్లో విజయం సాధించగా ,  శివసేన  56 సీట్లు కైవసం చేసుకుంది . 


మరింత సమాచారం తెలుసుకోండి: