టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఐదేళ్ల క్రితం జనసేన పేరుతో సొంతపార్టీని నెలకొల్పి, గత ఎన్నికల్లో టిడిపికి మద్దతివ్వడం జరిగింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన జనసేనకు ప్రజల నుండి చాలావరకు నెగటివ్ స్పందన లభించింది. ఇక అధినేత పవన్ కూడా తాను పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో కూడా ఓటమిపాలయ్యారు. ఇక ఆ పార్టీకి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో కేవలం ఒకే ఒక్క సీటు లభించింది. ఇకపోతే ప్రస్తుతం తన జనసేన పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి మరింతగా చేరువయ్యేలా పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రచిస్తున్నారు. అలానే మధ్యలో ఫ్యాన్స్ కోసం సినిమాల్లో కూడా నటించాలని నిర్ణయించారు పవన్. 

ఇక వైసిపి పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా మంత్రి అయిన అనిల్ కుమార్ యాదవ్ నేడు పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసారు. తాను చిన్నప్పటినుండి సినిమాలు బాగా ఎక్కువగా చూసేవాడినని, అలానే తనకు మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం అని అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా ఎంత గొప్పగా సక్సెస్ అయి ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించుకున్నప్పటికీ, రాజకీయాల్లో మాత్రం ఆయన పూర్తిగా ఫెయిలైన వ్యక్తేనని అన్నారు అనిల్. గత ఎన్నికల సమయంలో టిడిపికి మద్దతిచ్చి చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని పెంచి పోషించిన పవన్ గారు, 

ఇటీవల అధికారం చేపట్టి, ప్రస్తుతం ప్రజలకు ఎంతో మేలైన పాలనను అందిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టడం మాత్రం సరైనదని కాదని అన్నారు. కావాలనే మా పార్టీపై, అలానే సీఎం జగన్ గారిపై పవన్ గారు కక్షపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తనకున్న మంచి పేరుని ఆయన చేజేతులా చెడగొట్టుకుంటున్నారని, కావున ఇకనైనా నిజానిజాలు గ్రహించి మాట్లాడితే బాగుంటుందని అనిల్ నేడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరి అనిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: