బంగారం ధర నేడు దేశి మార్కెట్ లో స్వల్పంగా కదిలింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం వంటి కారణాలే బంగారం పెరగటానికి కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు, అయితే బంగారం బాటలోనే నడిచింది వెండి ధర కూడా. ఎంసీఎక్స్ మార్కెట్ లో వెండి ధర కేజీకి 0.6 శాతం పెరుగుదలతో రూ.44,137కు చేరింది. 

                         

ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం ధర 0.35 శాతం పెరుగుదలతో 10 గ్రాములకు రూ.37,820కు చేరింది. అయితే బంగారం ధర సెప్టెంబర్ నెలలో 10 గ్రాములకు ఏకంగా రూ.40,000 పైకి చేరింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2,200 తగ్గింది, అంతే కాదు వెండి ధర కూడా సెప్టెంబర్ నెలలో కేజీకి రూ.51,000 పలికింది. 

                         

కానీ ఈ నెల దాదాపు బంగారం ధరలు తగ్గాయి. అయితే గత వారం రోజులగా బంగారం ధరలు తగ్గిపోగా ఇప్పుడు భారీగా డిమాండ్ పెరిగింది అని అందుకే బంగారం ధరలు మళ్ళి పెరుగుతున్నాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా ఇలా బంగారం ధర మళ్ళి పెరగటానికి కారణం డాలర్ పెరగటమే అని నిపుణులు చెప్తున్నారు. 

                             

ఏది ఏమైనా ఒక వైపు బంగారం ధర గత నెలకు ఇప్పటికి తగ్గింది అని ఆనందపడాలో.. లేక ఈరోజు పెరిగింది అని బాధపడాలో తెలియటం లేదు పసిడి ప్రేమికులకు. అయినప్పటికీ బంగారం ధర సెప్టెంబర్ కు ఇప్పటికి భారీగా తగ్గింది అనే చెప్పాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: