గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక సమస్య తీవ్రరూపం దాలుస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత   సమస్య వల్ల రాష్ట్రం మొత్తం అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. అంతేకాకుండా ఇసుక కొరత సమస్య తో రాష్ట్రంలో ఎవరు ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. అటు భవన  నిర్మాణరంగ కార్మికులు కూడా ఇసుక కొరత వల్ల తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీస ఉపాధి లేక పస్తులు ఉంటున్నారు. ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై మనస్తాపం చెంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు  భవన నిర్మాణ రంగ కార్మికులు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలన్నీ వైసిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రంలో  జగన్ సర్కారు ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానం వల్లే ఇసుక కొరత ఏర్పడిందని దుమ్మెత్తి పోస్తున్నాయి. 

 

 

 

 ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొత్త సమస్య తీర్చి  భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇసుక సమస్య పరిష్కారం కోసం ఒకరోజు దీక్ష చేపట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విశాఖలో సెంట్రల్ పార్కులో  లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఇక ఈ నెల 14న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇసుక సమస్య పై  12 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నారు. దీక్ష ద్వారా ఇసుక సమస్యపై  ఆందోళన తీవ్రతరం చేయాలని భావిస్తోంది టీడీపీ

 

 

 

 ఈనెల 14న 12 గంటల పాటు  నిరసన దీక్ష చేపట్టేందుకు చంద్రబాబు పూనుకున్నారని... దీక్ష కోసం బిజెపి పార్టీ మద్దతు కోరతామని టిడిపి వర్గాలు చెప్పాయి. ఇక విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష కొనసాగుతుందని తెలిపారు. ఈ మేరకు ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తో టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా భేటీ అయ్యారు. చంద్రబాబు దీక్షకు బిజెపి నుంచి మద్దతు తెలపాలని కోరారు. అయితే ప్రజా సమస్యలపై తాము సొంతంగానే పోరాటం చేస్తాం  అంటూ కన్నా లక్ష్మీనారాయణ తెలిపినట్లు సమాచారం. ఇదిలా ఉండగా చంద్రబాబు దీక్షకు జనసేన సిపిఎం సిపిఐ పార్టీలు  సంఘీభావం ప్రకటించినట్లు ఆలపాటి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: