గత మూడు రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల వాతావరణం చాలా వేడిగా ఉంది. రోజుకి ఒక రీతిలో మలుపు తిరుగుతున్న ఈ హై టెన్షన్ డ్రామా రానున్న 24 గంటల్లో ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. అయితే ఇంతకు ముందు భారతదేశంలోనే అతి పెద్ద పార్టీ అయిన బిజెపికి మహారాష్ట్రలో శివసేన తమకు సీఎం కుర్చీ రెండున్నర ఏళ్ళు కావాలని పట్టుపట్టడంతో బిజెపి ఇలా అయితే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని తేల్చి చెప్పేసిన విషయం తెలిసిందే. తర్వాత గవర్నర్ రాష్ట్రంలో రెండవ పెద్ద పార్టీ అయిన శివసేనకు ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఇచ్చిన విషయం కూడా తెలిసిందే.

అయితే శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే అటు ఎన్సీపీ తో పాటు ఇటు కాంగ్రెస్ మద్దతు కూడా అవసరం ఉంది. అయితే మొదటి నుంచి శివసేనకు మరియు కాంగ్రెస్ కి ఉన్న సిద్ధాంత బేధాల కారణంగా ఇది సాధ్యపడే విషయం కాదు అనుకున్నారంతా. కానీ కాంగ్రెస్ తో ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సోనియా తో విపరీతమైన మంతనాలు జరిపారు. దీంతో కాంగ్రెసు ప్రెసిడెంట్ సోనియాగాంధీ తాము శివసేన కి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మద్దతు ఇవ్వడానికి సిద్ధమని ఎన్సీపీ తో తెలిపారు.

ఇదే విషయమై ఉద్దవ్ థాక్రే మరియు సోనియా గాంధీ ఫోన్ లో కూడా మాట్లాడేసుకున్నారు. సరిగ్గా అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి అనుకున్న సమయంలో శివసేన తాము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమని గవర్నర్ వద్దకు వెళ్లగా ఆయన కాస్తా మీకు ఇచ్చిన గడువు పూర్తయింది అంటూ వారి అభ్యర్థనను తిరస్కరించాడు. ఉద్ధవ్ థాక్రే పవార్ ను కలవడంలో మరియు పవార్ సోనియాను ఒప్పించడంలో జరిగిన జాప్యం కారణంగా శివసేన తాము ముఖచిత్రంగా ఉండి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బంగారు అవకాశాన్ని చేజార్చుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: